ఆపదొచ్చిందా.. App తో మాయం(TSNPDCL)

పది రకాల సేవలు అందిస్తున్న టీఎస్ ఎన్పీడీసీఎల్

విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేలా టీఎస్ ఎన్పీడీసీఎల్ ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ మరో అడుగు ముందుకేసింది పదిరకాల సేవలు ఒకే దగ్గర లభించేలా ప్రత్యేకంగా ఎన్పీడీసీఎల్ బిల్ డెస్క్ అనే పేరుతో ఓ యాప్ ను రూపొందించింది విద్యుత్ సరఫరాలో ఎచ్చుతగ్గులు ఒరిగిన స్తంభాలు వీధుల్లో ఇళ్లకు తాకే తీగల తొలగింపు ప్రమాదకరంగా ఉన్న నియంత్రికలు సరఫరా లో నెలకొన్న అంతరాయాలు ఇలా ఒకటేమిటి సమస్య ఏదైనా ఇంటి వద్ద ఉండి చరవాణితో అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు బిల్లుల చెల్లింపులతో పాటు మరో తొమ్మిది రకాల సేవలు ఫిర్యాదులు సలహాలు సూచనలు వినియోగించుకోవచ్చు

యాప్ డౌన్లోడ్ ఇలా
ఇంటర్నెట్లో గూగుల్ ప్లే స్టోర్స్ లోకి వెళ్లి టీఎస్ ఎన్పీడీసీఎల్ అని టైప్ చేయగానే టీఎస్ ఎన్పీడీసీఎల్ బిల్ డెస్క్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత రిపోర్ట్ ఆన్ ఇన్సిడెంట్ కంప్లైంట్ సెల్ఫ్ రీడింగ్ బేబీస్ బిల్స్ హిస్టరీ ఆన్లైన్ పేమెంట్స్ హిస్టరీ లింక్ ఆధార్ అండ్ మొబైల్ టార్చ్ డీటెయిల్స్ ఎనర్జీ టిప్స్ సేఫ్టీ టిప్స్ అనే పది రకాల ఆప్షన్లో కనిపిస్తాయి
రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈమెయిల్ ఐడి తో పాటు ఫోన్ నెంబర్ను నమోదు చేయాలి వినియోగదారుడు సర్వీసు నంబరు బోల్డ్ లెటర్స్ లో ఉన్న సంఖ్యను నమోదు చేసి సబ్మిట్ చేయాలి యాప్ ద్వారా చేసిన దరఖాస్తులను ఫిర్యాదులను ఉన్నతాధికారులు సంబంధిత కార్యాలయానికి పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు సమస్య పరిష్కారం అనంతరం వినియోగదారుడు చలవానికి తిరిగి ఈ సమాచారం వస్తుంది

Related Posts

253 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *