కొబ్బరి కాయలోకి నీళ్లు ఎలా వస్తాయి..?

కొబ్బరికాయలో కైనా తాటి ముంజలో కైనా నీళ్లు బయట నుంచి రావు ఇంటిపైన ట్యాంకు మీదకు పంపులో నీళ్లు కొట్టినట్టుగా చెరువుల్లోకి కాల్వల ద్వారా నీరు వచ్చినట్టుగా కొబ్బరికాయలోకి నీళ్లను ఎవరు నింపరు కొబ్బరికాయ తయారయ్యే క్రమంలో భాగంగానే దానిలోకి నీళ్లు వస్తాయి తాటి చెట్టు విషయంలోనూ అంతే

లేత కొబ్బరికాయ టెంకలు పూర్తిగా కొబ్బరినీళ్ళే ఉంటాయి తన జీవన చర్యల్లో భాగంగా ఈ కొబ్బరికాయ తొడిమ భాగం ద్వారా మీరు లవనాలు పోషకాలు కార్బోహైడ్రేట్లు కొవ్వు రేణువులు తదితర పదార్థాలు క్రమేపి టెంకలాంటి కలశంలోకి చేరుకుంటాయి ఆ ద్రవణం మెల్లమెల్లగా సాంద్రతరమవుతుంది అదే సమయంలో కొబ్బరి టెంక పెంకు కూడా గట్టిపడుతూ వస్తుంది కింద పడ్డ టెంక పగిలిపోకుండా కాపాడేందుకు కొబ్బరికాయ పీచు ఉపయోగపడుతుంది లావైన కాయ కావడం వల్ల చాలా గట్టిగా ఉండే ఫలావృంతం సాయంతో కొబ్బరికాయల గుత్తికి అంటుకొని ఉంటుంది కొబ్బరి నీళ్లలోంచి పోషక పదార్థాలు కొవ్వు రేణువులు గట్టిపడుతూ టెంకాయ లోపల కొబ్బరిగా రూపుదారుస్తాయి శాస్త్రీయంగా చూస్తే కొబ్బరి అంటే దాన్లో నీటి శాతం తక్కువ ఘన పదార్థం ఎక్కువ ఉంటాయి ఎండు కొబ్బరిలో ఈ స్థితి మరి అధికంగా ఉంటుంది కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది

పరిమితమైన ప్రమాణంలోనే పోషక విలువలు ఉండడంవల్ల ఊబకాయం ఒబైసిటీ ఉన్నవారు వ్యాయామం పాటు కొబ్బరి నీళ్లు తాగుతూ ఆహార నియమాలు పాటిస్తారు

ప్రపంచంలో అత్యధికంగా కొబ్బరి ఉత్పత్తి చేసే దేశాల్లో భారతదేశం మూడవ స్థానంలో ఉంది సాలిన సుమారు కోటి టన్నుల కొబ్బరిని ఉత్పత్తి చేస్తుంది ప్రథమ స్థానంలో ఉన్న ఫిలిప్పీన్స్ సాలీనా 1.70 కోట్ల టన్నులు ఉత్పత్తి చేస్తుండగా ద్వితీయ స్థానంలో ఉన్న ఇండోనేషియా 1.50 కోట్ల టన్నుల్ని ఉత్పత్తి చేస్తుంది అయితే కొబ్బరి సాగవుతున్న భూ వైశాల్యం పరంగా చూస్తే భారతదేశానికి ప్రథమ స్థానం

సుమారు 96% వరకు కొబ్బరి నీళ్లలో మామూలు నీళ్లు ఉంటాయి కేవలం 28% మేరకు చక్కెరలు 0.5% వరకు లవణాలు ఉంటాయి సముద్రతీరా ప్రాంతాల్లో విస్తారంగా పండే కొబ్బరి తోటలు కొబ్బరికాయలను ఇతర ప్రాంతాలకు రవాణా చేసిన మార్కెట్లో సుమారు ఆరు రూపాయలకు కొబ్బరి బొండం దొరుకుతుంది ఇంతకన్నా రెండు మూడు రేట్లు ఎక్కువ ధర ఉండడంతో పాటు అనారోగ్యాన్ని కలిగించే ఆమ్లాత్వం ఉన్న కూల్ డ్రింక్స్ మానేసి కొబ్బరి నీళ్లు తాగడం మంచిదని చెబుతారు నిపుణులు

Related Posts

4 Comments

  1. I think other web site proprietors should take this site as an model, very clean and fantastic user genial style and design, as well as the content. You are an expert in this topic!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *