గురువింద గింజల గురించి మీకు తెలుసా…!

Gurivinda Ginjalu: గొప్పలు చెప్పుకుని ఎదుటివారిని అవమానించే వాళ్లను గురువింద గింజల తో పోలుస్తారు.. గురువింద గింజ తన కింద నలుపు ఎరుగని శాస్త్రం.. పూర్వ ఈ గింజలను బంగారం తూకం వేయడానికి ఉపయోగించే వారు.. గురువింద గింజల ను లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారు.. ఇది తీగ జాతి మొక్క.. ఇందులో ఆకుపచ్చ, పసుపు, తెలుగు, నలుపు రకాలు ఉన్నాయి.. కాకపోతే ఇది అరుదుగా కనిపిస్తాయి.. ఈ చెట్టు గింజలు విషపూరితంగా భావిస్తారు.. ఈ చెట్టు ఆకులు, కాండం లో ఔషధ గుణాలు ఉన్నాయి ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఆరోగ్య ప్రయోజనాలు.. గురివింద గింజలను ధరిస్తే జరిగే అద్భుతాల గురించి తెలుసుకుందాం..!!

Gurivinda Ginjalu: గురివింద గింజలతో ఈ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు..!!

గురివింద గింజలు, ఆకులు, వేర్లు సాంప్రదాయ ఔషధం లో ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు.. ఈ గింజలు విషపూరితమైనవి. అయితే ఈ గింజల పై ఉన్న పొట్టు తీసి లోపల భాగాన్ని ఉపయోగించవచ్చు. గురువింద గింజల పై ఉన్న పొట్టును తీసి అరగ తీయాలి. ఇందులో నువ్వుల నూనె కలిపి పేనుకొరుకుడు ఉన్నచోట రాయాలి. ఇలా రాయటం వలన త్వరగా వెంట్రుకలు మొలుస్తాయి. ఈ గింజలను తీసి అందులో కొంచెం గంధం కలిపి పేనుకొరుకుడు ఉన్నచోట రాస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది. గురివింద గింజల తో వేసే పొగ మన ఇంట్లో దోమలు పోతాయి. వారంలో రెండు రోజులు ఈ పొగ వేయడం వలన ఇంట్లోకి దోమలు రాకుండా దోమలు గుడ్లు పెట్టకుండా చేస్తుంది.గురువింద ఆకులను మెత్తగా నూరి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని రెండు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవిపోటు తగ్గిపోతుంది. ఈ ఆకుల చూర్ణానికి సమానంగా చక్కెర కలిపి తాగితే దగ్గు త్వరగా తగ్గుతుంది. ఈ ఆకులను ఆముదం రాసి వేడి చేసి వాపులు ఉన్నచోట కట్టుకడితే త్వరగా తగ్గుతాయి ఈ ఆకులను నమిలి తింటే బొంగురు గొంతు సమస్యను నివారిస్తుంది. చక్కటి కంఠస్వరం వస్తుంది.ఆకుల రసాన్ని తీసుకొని తెల్ల మచ్చలు ఉన్న చోట రాసి ఒక పదిహేను నిమిషాల పాటు ఎండలో ఉండాలి ఆ తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే నల్లమచ్చలు తగ్గిపోతాయి ఈ ఆకులను మెత్తగా నూరి నువ్వుల నూనెలో పోసుకొని నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి కోవాలి. ఈ నూనెను ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి ప్రతిరోజూ ఆ నూనెను జుట్టుకు పట్టిస్తే జుట్టు రాలడం ఆగిపోతుంది. ఈ జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది.

Gurivinda Ginjalu: ఈ రంగుల గురువింద గింజల ధరిస్తే ఈ దోషాలు పోతాయి..!!

గురువింద గింజల ను లక్ష్మి స్వరూపాలుగా భావిస్తారు. తెలుపు రంగు గింజలు శుక్ర గ్రహ దోష నివారణకు, ఎరుపు రంగు గింజలు కుజ గ్రహ దోష నివారణకు, నలుపు రంగు గింజలు శని గ్రహ దోష నివారణకు, పసుపు రంగు గింజలు గురు గ్రహ దోష నివారణకు, ఆకు పచ్చ రంగు గింజలు బుధ గ్రహ దోష నివారణకు ఉపయోగపడతాయి.. ఆయా గ్రహ దోష నివారణకు ఈ గింజలను చేతికి కంకణాలు, కాళ్ళకు కడియాలు చేపించుకొని కట్టుకుంటారు. వీటిని ధరించడం వలన గ్రహ దోషాలు కాకుండా నరదిష్టి కూడా తొలగిపోతుంది.

Related Posts

173 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *