గోమాత విశిష్టత……!

గోవు యొక్క విశిష్టత గురించి ప్రతీ మనిషి తెలుసుకుని తీరాలి. ఎందుకంటే… ప్రపంచం లో ఆక్సిజన్ పీల్చుకొని, ఆక్సిజన్ వదిలే ఏకైక ప్రాణి మన గోవు. అంతే కాకుండా అందరూ కోరుకునే అష్టైశ్వర్యములు, గోవు అడుగులయందు ఉందును. అందుకే భారత దేశంలో గోవును ఎంతో పవిత్రంగా పూజిస్తుంటారు. ప్రతి ప్రసిద్ది చెందిన దేవాలయాల్లో గోశాల ఖచ్చితంగా ఉంటుంది. గోవు యొక్క విశిష్టత గురించి చూదాం…

1.గోవు కొమ్ముల మెుదట బ్రహ్మ విష్ణువులు.

2.కోమ్ముల చివర గంగాది తీర్ధములు

3.నుదురు నందు రుద్రుడు

4.నుదురు పై భాగమున మహాదేవుడు

5.నాసికాదండమున షణ్ముఖుడు

6.చెవులలో అశ్వనీదేవతలు

7.కుడికన్నులో భాస్కరుడు,ఎడమకన్నులో చన్ద్రుడు

8.జిహ్వలో వరుణుడు

9.హుంకారమున సరస్వతీదేవి

10.దవడలలో యమధర్మరాజు

11.పెదవులలో ఉభయ సంధ్యలు

12.మెడనందు ఇంద్రుడు

13.ఉదరమున త్రయోదశ విశ్వేదేవతలు

14.వక్ష స్థలమున గాయత్రి

15.నాల్గుపాదాలలో నాల్గు వేదములు

16.డెక్కల మధ్య గంధర్వులు

17.డెక్కల చివర గరుత్మంతుడు

18.డెక్కల ఉభయపార్శ్వములలొ అప్సరసలు

19.ప్రుష్ఠమున లక్ష్మీ నారాయణులు, ఏకాదశరుద్రులు

20.అవయవ సంధులలో అష్టవసువులు

21.పిరుదలలో పిత్రు దేవతలు

22.తోకనందు సోముడు

23.తోకయందలి రోమములలో సూర్యచన్ద్రులు

24.మూత్రమున గంగాదేవి

25.పోదుగు నుండి వచ్చు పాలలో సరస్వతీదేవి

26.పెరుగులో నర్మదతీర్ధం

27.నెయ్యినందు అగ్నిహోత్రుడు

28.పేడయందు లక్ష్మీ దేవి

29.మూత్రమున గాయత్రీ దేవి

30.రోమములలో త్రయత్త్రింశత్కోటిదేవతలు

31.ఉదరమున భూమాత మెుదలగు సమస్త దేవతలుకలరు.

అందుకే గోపూజచేద్దాం సకల శుభాలుపొందుదాము. 🙏సుదర్శనం

Related Posts

4 Comments

  1. Useful information. Lucky me I found your website unintentionally, and I am surprised why this twist of fate didn’t took place earlier! I bookmarked it.

  2. An fascinating dialogue is price comment. I think that it is best to write extra on this matter, it might not be a taboo topic but usually people are not enough to talk on such topics. To the next. Cheers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *