శస్త్ర చికిత్స సమయంలో వైద్యులు పచ్చని వస్త్రాలు ఎందుకు ధరిస్తారో తెలుసా

మనం చాలా సార్లు గమనించే ఉంటాం ఆస్పత్రికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి తెరలు కానీ బెడ్ షీట్స్ చుట్టూ ఉన్న పరిసరాలు అధిక మొత్తంలో గ్రీన్ మ్యాట్ స్ కనిపిస్తూ ఉంటాయి రోగి శస్త్రచికిత్స సమయంలో రోగికి మరియు వైద్యులు పచ్చని వస్త్రాలను ధరిస్తారు.

అసలు విషయమేమిటంటే మన కళ్ళకు అసౌకర్యంగ కనిపించే టటువంటి కలరు ఎరుపు. మన రక్తం కూడా ఎరుపు వర్ణం లో వుంటుంది.రోగులు శస్త్రచికిత్స శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో రక్తాన్ని చూసి భయపడకుండా ఉండడానికి పచ్చని వస్త్రాలను ధరిస్తారు. ఆపరేషన్ సమయంలో అధిక రక్త స్రావం జరిగే ప్రమాదం ఉన్నందువల్ల ఈ పచ్చని వస్త్రాలు ధరించడం వల్ల రక్తపు చుక్కలు పచ్చని వస్త్రాలపై పడి ఆ పడ్డతువంటి రక్తం ఎరుపుగా కాకుండా డార్క్ బ్రౌన్ లేదా గోధుమ వర్ణపు ఛాయలో కనిపిస్తుంది. అందువల్ల రోగులు రక్తాన్ని చూసి భయపడకుండా భయాందోళనలకు గురి కాకుండా ఉండడానికి మరియూ చికిత్స కి సహకరించడానికి ఈ పచ్చని వస్త్రాలు ఉపయోగపడుతాయి.

అదే కాకుండా శాస్త్రీయపరంగా పచ్చని వస్త్రాలు ధరించడానికి ఇంకో బలమైన కారణం ఉంది అదేమిటంటే రోగికి శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో చికిత్స జరుగుతున్నటువంటి అవయవాలు వైద్యుల కళ్ళకి సరిగ్గా కనిపించి చికిత్స విజయవంతం అవడానికి పచ్చని వస్త్రాలు ఉపయోగపడతాయి. అందుకే ఆపరేషన్ గదిలో ఎక్కువగా ఈ పచ్చని వస్త్రాలు కనిపిస్తుంటాయి .

Related Posts

64 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *