Blueberry benifits in telugu నేరేడు పండు ఉపయోగాలు

నేరేడు.. సీజనల్ ఫ్రూట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడే ఇవి విరివిగా దొరుకుతాయి.అయితే మేము చెప్పే విషయాలు చదివితే మీరు నేరేడును మీరు అస్సలు మిస్ అవ్వరు. నేరేడులో ఎన్నో పోషక గుణాలు ఉంటాయి.

Neredu Pandu Health Benefits: మనం ఫిట్‌గా ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలు బెస్ట్ ఆప్షన్. అందులో నేరేడు పండ్లు కూడా ఒకటి. జామూన్ చెట్టు మే, జూన్ నెలలో నేరేడు ఫలాలను ఇస్తుంది. తీపి, వగర మిళితమై.. స్పెషల్ టేస్ట్ కలిగి ఉండే ఈ పండుకు రోగాలనూ నియంత్రించే శక్తి  కూడా ఉంది. ఒక్క పండే కాదు.. ఆకులు.. బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.  ముఖ్యంగా శరీరానికి ఎంతో అవరసమైన విటమిన్ సి అధికంగా లభిస్తుంది. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఆరోగ్య ఫల ప్రధాయిని నేరేడు పండు  తినడం వలన కలిగే లాభాల గురించి తెలుసుకుందాం..చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు పోవటానికి నేరేడు పండ్లను తినటం మంచిది.మొటిమలు, మధుమేహం, ఆర్థరైటిస్‌ వంటి వాటికి ఇది ఉత్తమ నివారణగా పనిచేస్తుందిదద్దుర్లు, మధుమేహం, ఆర్థరైటిస్‌ వంటి సమస్యలకు ఇది ఔషధంలా పనిచేస్తుంది.నేరేడు పండులో చక్కెర తక్కువగా ఉంటుంది. దీనిని రోజూ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు.పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలకు కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉంది.నేరేడు పండ్లు శరీరానికి చలవ చేస్తాయి.హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి కూడా ఈ ఫ్రూట్ సాయపడుతుంది.దీర్ఘకాల వ్యాదులకు నివారణకు నేరేడు పండ్లను తినటం వలన రోగ నిరోదకశక్తి పెరుగుతుంది. వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది.నేరేడు తినడం వల్ల తరచూ దప్పిక వేయడం, యూరిన్‌కి పోవడం వంటి సమస్యలు అదుపులో ఉంటాయి.నీరసం, నిస్సత్తువ ఉన్న వారు నేరేడు పండును తింటే తక్షణ శక్తి వస్తుంది.జిగట విరేచనాలతో బాధపడే వారికి నేరేడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాల చొప్పున ఇవ్వాలి. రోగికి శక్తితోపాటు పేగుల కదలికలు నియంత్రణలో ఉంటాయి.ఆస్తమా, బ్రాంకైటిస్‌ సమస్యలతో బాధపడేవారికి సైతం నేరేడు మంచిది.ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.జ్వరంగా ఉన్నపుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర తాపం తగ్గుతుంది.పిండి పదార్థాలు, కొవ్వు భయం ఉండదు కనుక నేరేడు పండ్లను అధిక బరువు ఉన్నవారు.. మధుమేహం రోగులు సైతం వీటిని రోజుకు ఆరు నుంచి ఎనిమిది దాకా తినవచ్చు.బ్యూటీ విషయంలో కూడా నేరేడు ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. దీనిని తరచూ తినడం వల్ల చర్మంపై ముడతలు పడవు. వృద్ధాప్య ఛాయలు కూడా త్వరగా కనిపించవు.అయితే నేరేడు పండ్లను గర్భిణీలు ఎటువంటి పరిస్థితులలో తినకూడదని నిపుణులు చెబుతున్నారు. జామున్ జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కానీ దాని అధిక మోతాదు వల్ల మలబద్ధకం సమస్య రావచ్చు. నేరేడు అరగడానికి ఎక్కువసమయం పడుతుంది కాబట్టి.. ఉప్పు వేసి అప్పుడప్పుడు తీసుకోవాలి

Related Posts

57 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *