క్యాప్సికం తో బోలెడు రాబాలు తెలుసుకోండి

చూడడానికి ఆకర్షణీయంగా కనిపించే కూరగాయ క్యాప్సికం.
వీటి ఆకర్షణ కాదు వీటిలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ఔషధ పోషకాలు ఉన్నాయి.

ఇవి ఆకర్షనీయమైన వివిధ రంగులలో మనకు లభిస్తుంటాయి.క్యాప్సికం ను తెలుగులో బుంగమిరుప అని పిలుస్తుంటారు.ఇవి తక్కువ కారం ఉండడం వల్ల వీటిని స్వీట్ పెప్పర్ అని కూడా పిలుస్తారు.వీటిని ఇతర కూరగాయలతోనే కాకుండా నేరుగా వంటలు చేసుకోవచ్చు వీటితో తయారు చేసిన సలాడ్స్ ఆకర్షణంగా మరియు రుచికరంగా ఉంటాయి.క్యాప్సికంలో విటమిన్ ఏ సి ఈ బీటా కెరోటిన్ బీ కాంప్లెక్స్, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి.ఇంకా వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి.వీటిని తినడం వలన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.వీటిలో ఉండే విటమిన్ ఏ కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇంకా శరీరంలో రక్తం గడ్డ కట్టకుండా ఉండేలా సహాయపడుతుంది.క్యాప్సికం లోని యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని ఫ్రీరాడికల్ కణాలను బయటకు పంపిస్తాయి. వీటిలో ఉండే క్యాప్సాసిమ్ అనే రసాయనం రక్త కణాలతో కలిసి క్యాన్సర్ను నివారిస్తుంది.క్యాప్సికం లో ఉండే ఆంటీ ఇంఫ్లమేటరీ లక్షణాలు శరీరంలోని వాపులని తగ్గిస్తాయి.వీటిలో ఉండే రసాయనం పెయిన్ రిలీఫ్ గా పని చేస్తుంది.వీటిని తినడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగవుతుంది జుట్టు ఊడటం సమస్య తగ్గుతుంది.క్యాప్సికం లో ఉండే విటమిన్ ఈ చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.వీటిని తినడం వల్ల శ్వాస వ్యవస్థ మెరుగవుతుంది ఆస్తమావ్యాధులు దూరం అవుతాయి.ఇంకా కడుపులో అల్సర్స్ వంటి సమస్యలు నయం అవుతాయి.

Related Posts

859 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *