ఫ్రూట్ ఆఫ్ ది ఏంజెల్ గా పిలువబడే బొప్పాయి పండు

ప్రతి ఋతువులో దొరికే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఇష్టంగా తినే పండ్లలో బొప్పాయి ఒకటి. బొప్పాయి పండును ఫ్రూట్ ఆఫ్ ది ఏంజెల్స్ గా పిలుస్తారు.
ఇది చాలా వేగంగా పెరిగే మొక్కలలో ఒకటి.

మెక్సికో నుండి సుమారు 400 వందల ఏళ్ళ క్రితం మన దేశానికి వచ్చిందని చరిత్ర చెబుతుంది.
బొప్పాయి పండు శాస్త్రీయ నామం Carical Papaya. దీనిని ఇంగ్లీషులో పపాయ అని పిలుస్తారు.
2020 లెక్కల ప్రకారం మన దేశం 43% బొప్పాయి పండ్లను సరాపర చేస్తుంది.
100 గ్రాముల బొప్పాయిలో కేవలం 32 కేలరీస్ మాత్రమే శక్తి ఉంటుంది అందువల్ల ఇది బరువు తగ్గాలనుకునే వారికి బాగా పనిచేస్తుంది.

ఇందులో విటమిన్స్ ,మినరల్స్, ఫ్లేవానైడ్స్ ఫైబర్లు అధికంగా ఉన్నాయి. బొప్పాయి చర్మం, గుజ్జు మరియు గింజలు వివిధ రకాల పైటో chemicals నీ కలిగి ఉంటుంది. వీటిలో కెరోట నాయీడ్స్ మరియు పాలిపినల్స్ అలాగే బెంజైల్ వేసోతియో సైనేట్ల్ మరియు బెంజైల్ గ్లూకో సివెట్లు ఉంటాయి.

బొప్పాయిలో ఉండే విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తి పెరగటమే కాకుండా చిగుళ్ల నుండి రక్తం కారే సమస్యను తగ్గిస్తుంది.
రక్తహీనతతో బాధపడే వారికి శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తక్షణంగా పెరగడానికి ఇది బాగా పనిచేస్తుంది.
ఇందులో పెప్సిన్ అనే ఎంజాయ్ ఉండడం వల్ల జీర్ణ క్రియ మెరుగవుతుంది.
ఇందులో ఉండే ఫైబర్ వల్ల ప్రేగుల్లో కదలికలు సాఫీగా జరిగి మలబద్ధకం లాంటి సమస్యలను ఇది బాగా పనిచేస్తుంది అంతేకాకుండా పెద్దప్రేగు క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా కాపాడుతుంది.

బొప్పాయి పండు తినడం వల్ల ఒత్తిడి తగ్గి ఉత్సాహంగా ఉండేలా అలసటను తగ్గిస్తుంది.

ఇందులోని విటమిన్ ఏ కంటి చూపుకు చర్మ సౌందర్యానికి జుట్టు పెరుగుదలకు మరియు గొళ్ళ ఆరోగ్యానికి సహాయపడుతుంది. వృద్ధాప్య ఛాయాలను దూరం చేస్తుంది.

మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను కరిగించేటటువంటి శక్తి వీటిలో ఉంది.

బొప్పాయి పండు నీ తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.

ఉదర సంబంధమైన జబ్బులను నయం చేయడంలో బొప్పాయి పండు సమర్థవంతంగా పనిచేస్తుంది.

శరీరంలో అంతర్గతంగా ఏర్పడిన వాపుల నివారణకు కాలిన గాయాలకు కమిలిన నొప్పి నివారణకు దీర్ఘకాలంగా వేధించే ఆర్థరైటిస్ ఆస్తమా వ్యాధులకు ఇది ఉపశమనాన్ని ఇస్తుంది.
కొవ్వు పదార్థాలు అధికంగా తినడం వల్ల శరీరానికి కొన్ని హానికరమైన వ్యాధులు సంభవిస్తాయి అరికట్టడంలో బొప్పాయి అద్భుతంగా పనిచేస్తుందని కొన్ని పరిశోధనల్లో తేలింది.
శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండెని ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.

Related Posts

60 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *