చిలగడ దుంప ఆరోగ్యా రహస్యాలు

చిలగడ దుంప ఒక విధమైన దుంప జాతికి చెందినవి. కందగడ్డ గెనసు గడ్డ మొహరం గడ్డ, ఆయి గడ్డ మరియు రత్నపురి గడ్డ అని వివిధ పేర్లతో పిలుస్తుంటారు.చాలామంది వీటిని పెద్దగా పట్టించుకోరు కానీ వీటిలో పోషకాలు దండిగా ఉంటాయి.

ఇవి లేత పసుపు నారింజ గులాబి రంగులలో దొరుకుతుంటాయి.

దీని శాస్త్రీయ నామం ఐపోమియా బటాటాస్

చిలకడదుంపల్లో విటమిన్ సి విటమిన్ బి6, పొటాషియం మెగ్నీషియం ఫ్యాంతోనిక్ ఆమ్లం, ఆంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి.

చిలకడదుంప లోని సహజ చక్కెరలు తీపిని కలిగి ఉండడం వల్ల మంచి రుచిని కలిగి ఉంటాయి.

వీటిని తినడం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుంది.

వీటిలో అధకంగా ఉండే పీచు తిన్నది నెమ్మదిగా జీర్ణం అవుతూ ఎక్కువసేపు శక్తిని విడుదల అయ్యేలా చేస్తాయి.

వంద గ్రాముల చిలగడ దుంపలో 120 కాలరీల శక్తి లభిస్తుంది.ఇవి దేహాదారుడ్యానికి కావాల్సిన carbs నీ అందిస్తాయి.

చిలకడదుంపల గ్లిసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల వీటిని తగిన మోతదులో మధుమేహస్తులు తినవచ్చు.

చిలకడదుంపల్లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్స్ వివిధ రకాలైన క్యాన్సర్ల నుండి రక్షిస్తాయి.

వీటిని తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి ఉపయోగకరంగ ఉంటాయి.

వీటిలో ఉండే పొటాషియం ఒంట్లో ఎక్కువగా ఉన్న ఉప్పును తొలగించి నీ మోతాదును నియంత్రిస్తూ అధిక రక్తపోటును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

చిలగడ దుంపలు తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు మరియు నాడీ వ్యవస్థ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

కొలెస్ట్రాల్ నీ తగ్గిస్తాయి.

వీటిలో ఉండే పోషకాలు కళ్లు మరియ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Related Posts

108 Comments

  1. Thanks, I’ve just been looking for information approximately this subject for ages and yours is the greatest I have found out so far. However, what in regards to the bottom line? Are you sure in regards to the source?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *