పనస పండు గొప్పతనం తెలుసుకుందామ

పనస మానవునికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం. పనసలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ఔషధ పోషకాలు దీని సొంతం.
పనస పండు ప్రపంచంలోని అతిపెద్ద పండుగ పేర్కొంటారు. ఇవి ఎక్కువగా వర్షాధారం ప్రాంతలలో పెరుగుతాయి.
పనస మలబారి కుటుంబానికి చెందినది. తూర్పు ఆసియా వీటి జన్మస్థలం. వీటిని ప్రపంచం నలుమూలల పండిస్తున్నారు. ఇవి దాదాపు ఒక్కోటి 36 కేజీలతో 90 సెంటీమీటర్ల పొడవు 50 సెంటీమీటర్ల వ్యాసంతో ఉంటాయి.
వీటిని సంస్కృతంలో “స్కందఫలం”, హిందీలో కటహక్ కటహర్ చక్కి , ఆంగ్లంలో ఇండియన్ జాక్ ఫ్రూట్ అని పిలుస్తుంటారు.
దీని శాస్త్రీయ నామం “ఆర్టో కార్పస్ హెటిరో ఫిల్లస్ “.
పనసలు విటమిన్స్ మినరల్స్ ఫైబర్స్ ఆంటీ ఆక్సిడెంట్స్ 5 న్యూట్రియన్స్ అంటూ ఎన్నో పోషకాలు ఉన్నాయి.
పనస పండులో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి ఇవి రోజు తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి మరియు మధుమేహం తగ్గుముఖం పడుతుంది.
పనస జీర్ణక్రియను పెంచుతుంది. దీనిలో ఉండే పీచు పదార్థం జీర్ణవ్యవస్థను శుభ్రపరచి మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
పనసలోని ఫైటో న్యూట్రియoట్స్ ,యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా యాంటీ క్యాన్సర్ గుణాలు శరీరంలోని ఫ్రీ ర్యాడికల్ కణాలతో పోరాడి బ్రెస్ట్, ప్రోస్ట్రేట్ , కలన్, స్కిన్, లంగ్ క్యాన్సర్ వంటి జబ్బుల ముప్పు నుండి కాపాడుతుంది.
దీనిలో ఉండే క్యాల్షియం ఎముకలు దృఢంగా గట్టిగా ఆరోగ్యంగా ఉండేలా మరియు కండరాలను సైతం బలోపేతం చేస్తుంది.
వీటిని తినడం వల్ల రక్తహీనత వంటి సమస్యలు తగ్గుతాయి.
పనసలోని ఐరన్ అండ్ మెగ్నీషియం మంచి నిద్రకు సహాయపడతాయి.
పనసలోని విటమిన్ A కంటి చూపులు మెరుగుపరుస్తుంది రే చీకటి వంటి సమస్యను దూరం చేస్తుంది.
వీటిని రోజూ తినడం వల్ల చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.
పనస పండు లోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
వీటిలో ఉండే ఖనిజ లవణాలు థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
పొట్టలో ఏర్పడిన అల్సర్లను మరియు వాతా పిత్త దోషాలను దూరం చేస్తుంది.
పనసలోని విడమించి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
పనస దేహపుష్టిని మరియు నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
ఏదైనా సరే మితంగా తినoడి ఇన్ని ప్రయోజనాలు ఇస్తుందనే ఉద్దేశంతో అతిగా తింటే కొత్త సమస్యలు వస్తాయి.
ప్రకృతిలో దొరికే పండ్లను తినండి ఆరోగ్యంగా జీవించండి.

Related Posts

634 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *