మా ఊరు…..My Village

మా ఊరు🌳🌴
పాతకాలపు సోకులేమి లేని యిప్పటి నా పల్లె ,,,,, కొన్ని ఏండ్లు యెనకకు పోయ్యాధాం
అర్షకాలం మొదలు పెరట్ల పోర్క పుల్ల ఏరి పొతం చేసి తయారు వుంచెట్టోళ్ళం….

పిరికెడు ఆశతో ఆన సుక్కల కోసం మొగులుకేసి చేతులు యెత్తి దడ్డం పెట్టీ అర్నదేవున్ని
మనసు నిండ ఆనలు కురిపించమని మొక్కెట్టోళ్ళం…

ఆయిటిమూనిందని మబ్బులు మ ఊరు మీద నల్లటి తెప్పలు పర్సుకొని సన్నటి తొలకరి జల్లు యిసురుతుంటే,మట్టి వాసన గుప్పు లేసి కమ్మగ గమగమలు ఎగజిమ్మేదే.🌧️☁️

చెలకలు చెండ్లు పొలాలు కడుపారా నీళ్ళు తాగి కొన్ని మసాలా తర్వాత తానమాడేవి
మొదలు దాకా ఎండిపోయి కనుమరుగైన గరక గడ్డి నేల పొత్తిళ్ళలో న్చి యిరుకొని బయటకచ్చేది… 🌱🌱🌱

గొడ్డు గోధా మేకలు గోర్లు లేత గడ్డి వనము చూసి దుంకులాడేవి🐑🐐🐃, పాలపిట్టలు మా గుడిసె సూరు కింది గడ్డి గూళ్ళు కట్టేవి,🐥
సాట్టేపించిన నాగలి కర్రు మెత్తటి పదునుతో మీసాలు తింపేది …….. ఇంకా కొనసాగింపు వుంది……..

Related Posts

86 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *