భూమిని పోలిన గ్రహం

విశ్వంతరాల్లోని సుదూర తీరాల్లో మనకు కనిపించని అద్భుతాలు ఎన్నో. వీటిని తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ మాoట్రిల్ కు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు సాగిస్తున్న ప్రయత్నాలు వృధా కాలేదు. మన గ్రహానికి 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న డ్రాగన్ నక్షత్ర కూటమిలోని బైనరీ వ్యవస్థలో సరిగ్గా భూమిని పోలిన ఓగ్రహం వారి కంటపడింది భూమిక అంటే సుమారు 70% పెద్దదని ఈ గ్రహంలో ఎక్కడ చూసినా దట్టంగా నీళ్లు ఉన్నట్టు శాస్త్రవేత్తలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు టాయ్ 1452 బి గా దీనికి పేరు పెట్టారు ఇదో బుల్లి నక్షత్రం చుట్టూ తిరుగుతోందని ఈ రెండింటి మధ్య దూరం కారణంగా ఈ గ్రహంపై నీళ్లు చాలా చల్లగా లేదంటే చాలా వెచ్చగా ఉండమన్నారు దీన్ని సముద్ర గ్రహంగా పేర్కొనడం సముచితం అని పరిశోధన సాగించిన చార్లెస్ కాడియక్స్ బృందం వ్యాఖ్యానించింది. కెనడాలోని మాంట్ మెగాటిక్ అబ్జర్వేటరీ లో అత్యంత ఖచ్చితమైన కొలతల కోసం రూపొందించిన పరికరాన్ని ఉపయోగించి శాస్త్రవేత్తలు ఈ గ్రహాన్ని కనుగొన్నట్టు ఆస్ట్రోనామికల్ జర్నల్ తెలిపింది.

Related Posts

1,785 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *