Kiwi ఫ్రూట్ గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు

కివి ఫ్రూట్ చిన్నగా గుడ్డు ఆకారంలో ఉన్న వీటిలో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. ఇవి 20వ శతాబ్దానికి ముందు ఎవరికి పెద్దగా వీటి ఉపయోగాలు తెలియవు. కానీ దాదాపు అన్ని ప్రదేశాలలో లభించడం మొదలయింది కివిలో రెండు రకాలు ఉంటాయి మొదటిది ఆకుపచ్చ రంగులో మరియు రెండవది బంగారం రంగులో ఉంటాయి.

ఈ కివి పండుని చైనీస్ గూస్బెర్రీ అని కూడా పిలుస్తుంటార. ఈ మధ్య భారతీయ నగర మార్కెట్లలో యాపిల్ పండంత ఖరీదులో లభిస్తున్నాయి. కమలాలకు రెట్టింపు ‘విటమిన్‌ సి’, ఆపిల్‌లోకన్నా అయిదు రెట్లు ఎక్కువ పోషకాలూ దీని సొంతం. పీచు పదార్థం, విటమిన్‌ ఇ, పొటాషియం, ఫోలిక్‌ యాసిడ్‌, కెరోటినాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు మరెన్నో పోషకాల నిలయం ‘కివీ’ పండు. న్యూజిలాండ్‌లో మాత్రమే పండే కివీలు ఇప్పుడు మన మార్కెట్‌లోనూ విరివిగా దొరుకుతున్నాయి. కొవ్వులూ, సోడియం తక్కువగా ఉండటంవల్ల హృద్రోగులూ, మధుమేహ వ్యాధిగ్రస్తులూ కూడా దీన్ని తినొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. బరువు తగ్గించుకోవాలనుకునేవారికీ ఇది మంచి నేస్తమే. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలవల్ల బీపీ, కొలెస్ట్రాల్‌ అదుపులో ఉంటాయి. పోషకాలే కాదు, నోరూరించే రుచి కూడా కివీ సొంతం.

కివిపండులో అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి . ఇది అనేక ప్రాంతాలలో పండిస్తారు, అండాకారములో ఉంటుంది . సుమారు 5.8 పొడవు 2.0 సెం.మీ. వెడల్పు, 5.5 సెం.మీ. ఎత్తు కలిగి మెత్తగా ఉంటుంది . మంచి సువాసన కలిగి ఉంటుంది . దీనిని వ్యాపార పండుగా అనేక దేశాలలో పండిస్తున్నారు .

చాలామంది దీనిని వండర్ ఫ్రూట్ అని పిలవటం కూడా వింటూంటాం. ఇంతటి ఆశ్చర్య ఫలితాలనిచ్చే ఈపండు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది.

Kiwi పండు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

1)ఒక అధ్యాయానం kiwi ఫ్రూట్ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మరియు శ్వాస తీసుకునేటప్పుడు వచ్చే గురకలాంటి శబ్దాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

2) కివీ ఫ్రూట్ లో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అస్తమా నుంచి బాధపడే వారికి నయం చేయడంలో సహాయపడుతుంది

3) కివి ఫ్రూట్ లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది దానితోపాటు పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడకుండా రక్షిస్తుంది

4) అదేవిధంగా కివి ఫ్రూట్ నీ రోజు తినడం వలన అందులో ఉన్న ఫైబర్ మలబద్ధక సమస్య రాకుండా నిర్మూలిస్తుంది.

5) కివి ఫ్రూట్ ని తినడం వలన మానవ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

6) ఈ పండ్లు oxidative stress నుండి కాపాడుతాయి

7) రోజుకి మూడు కివి పండ్లను తీసుకోవడం వలన బ్లడ్ ప్రెషర్ ని అదుపులో ఉంచుకోవచ్చు

8) కివి ఫ్రూట్ లో ఉండే పొటాషియం గుండెపోటును తగ్గించడంలో సహాయపడుతుంది

9) కివిలో ఉండే విటమిన్ ఏ మరియు E వలన సూర్యకాంతి నుండి వచ్చే అల్ట్రా వైలెట్ కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.

10) కివి లో ఉండే ఆంటీ క్యాన్సర్ గుణాలు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ వంటి భయంకరమైన జబ్బులకు గురి కాకుండా రక్షిస్తుంది

Related Posts

68 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *