Garika Gaddi: కలుపు మొక్కగా భావించే గరకతో ఎన్నో సమస్యలకూ చెక్

గరిక గడ్డి పొలం గట్ల పై, ఒడ్లల్లో సెలక భూములలో గరిక ఎక్కువగా మొలుస్తుంది. పశువులు ఇష్టంగ తినే గడ్డిలో గరిక ముందు వరసలో ఉంటుంది.ఈ పశువులు మేసే గడ్డి గురించి మనకెందుకులే అని తీసిపారేయకండి.గరికను మనం కలుపు మొక్కగా భావించినప్పటికీ.మానవునికి అనేక ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది.

గరిక వినాయకునికి ఇస్తమైనదని పురాణాల్లో చెబుతుంటారు.వీటితో వినాయకుణ్ణి పూజిస్తారు. సంక్రాంతి ముగ్గులో గొబ్బెమ్మ లో కూడా వీటిని వాడతారు.

ఆయుర్వేదం లో గరికకు ప్రత్యేక స్థానముంది.వీటితో అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. సంస్కృతం లో శతవీర్య, హిందీలో దూర్వా,దూబ్ అని పిలుస్తారు.

ఇంగ్లిష్ లో బెర్ముడా గ్రాస్ అని పిలుస్తారు.

దీని శాస్త్రీయ నామం సైనోడాన్ డాక్టిలాన్.

గరిక లో రెండు రకాలున్నాయి. అవి తెల్ల గరిక మరియు నల్ల గరిక , నల్ల గరిక కంటే తెల్ల గరిక లోనే ఔషద గణాలు ఎక్కువ.

గరిక లో ఆంటీ వైరల్ గుణాలున్నాయి. ఇందులొ ఉండే కార్బోహైడ్రేట్స్ , ఖనిజాలు, ఫ్లావనాయిడ్స్,కేరోటనైడ్స్,అల్కలోయిడ్స్ శరీరంలో ఆంటీ బాడీస్ ను పేంచుతాయి.

గాయాల నుండి రక్తం కారుతూ ఉంటే గరిక, ఉత్తరేణి ఆకులతో పాటు యాలకులను సమానంగా తీసుకొని మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని గాయాలపై అప్లై చేస్తే రక్తం ఆగి గాయం త్వరగా నయం అవుతుంది.

గజ్జి ,తామర ,దురద, దద్దుర్లు వంటి చర్మవ్యాధులకు గరిక గడ్డిని మరియు పసుపును మెత్తగా నూరి వ్యాధి ఉన్నచోట అప్లై చేస్తే సమస్యలు తగ్గిపోతాయి. గరిక గడ్డి దగ్గు మరియు కపాన్నితగ్గిస్తుంది.

గరిక తైలంతో చెవి ముక్కు గొంతు సమస్యలు పరిష్కరించబడతాయి. గరిక తైలం:-శుభ్రమైన గరక గడ్డి రసం 80 గ్రాములు, నువ్వుల నూనె 60 గ్రాములు, ముల్లంగి రసం 60 గ్రాములు, సైంధవ లవణం 10 గ్రాముల చొప్పున ఒక పాత్రలో తీసుకొని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని చిన్న మంటపై నూనె మిగిలెంత వరకు వేడి చేసి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తైలంతో నాలుగు చుక్కల మోతాదులో చెవిలో వేసుకుంటే చీము, చెవుడు సమస్యలు తొలగిపోతాయి.

గరిక కాషాయం తాగటం వల్ల జ్వరం తగ్గిపోతుంది.

సంతానలేమి సమస్యలకూ పరిష్కారం ఈ గరక గడ్డి

మూత్ర సంభందిత వ్యాధులకు గరిక ఎంతగానో ఉయోగపడుతోంది. మూత్ర పిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతుంటే గరిక గడ్డి రసం మూడు టీ స్పూన్ల చొప్పున రెండు పూటలా తీసుకుంటే మూత్ర పిండాల్లో రాళ్ళు మాయమైపోతాయి. మూత్రం లో మంట,మూత్రం లో రక్తం సమస్యలకూ గరిక కాషాయం తీసుకుంటే సరిపోద్ది.

నెలసరి సరిగ్గా లేని మహిళలు గరిక వేర్లను దంచి రసం తీసి 5గ్రాముల చొప్పున రెండు పూటలా తీసుకుంటే సమస్య నయమవుతుంది అర్ష మొలలతో ఇబ్బంది పడుతుంటే గరిక గడ్డినీ మెత్తగా నూరి మలద్వారం లో ఉన్న పిలకలపై పూస్తే అర్ష మొలలు మాడి మసై పోతాయ్.పిలకల నుంచి కారే రక్తాన్ని అరికడుతుంది.

గరిక ను పచ్చడిగా చేసుకొని భోజనంతో కలిపి తీసుకుంటే శరీర నొప్పులు నయమవుతాయి.

గరిక గడ్డిని నూరి ముద్దగా చేసి నెయ్యి తో కలిపి శరీర పొక్కులపై అప్లై చేస్తే సమస్య తీరిపోతుంది.

Related Posts

1,766 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *