Ladies finger:జ్ఞాపకశక్తిని, తెలివితేటలను పెంచే బెండకాయ

బెండకాయ చాలా రకాల కూరగాయలలో బెండకాయ ఒకటి . చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలామంది ప్రజలు వీటిని ఇష్టపడినప్పటికీ రుచి పరంగా కొంత మంది వీటి కి దూరంగ ఉంటారు.

వీటికి okra,భింది అని వివిధ పేర్లున్నాయి.

వీటితో అనేక రకాల వంటకాలు చేస్తారు.వీటిని ఆర బెట్టి వరుగులు,పచ్చళ్ళు తయారు చేస్తారు. వీటితో బజ్జీలు మరియు పకోడీ వంటి పిండి వంటలు చాలా రుచికరంగా ఉంటాయి.

వీటి కాండాన్ని కాగితపు పరిశ్రమ లో వాడుతారు. దీని శాస్త్రీయనామం Abelmoschus esculentus

ఏదీ ఏమైనప్పటికీ బెండకాయ లో ఉండే ఔషధ గుణాలు వేరే ఏ కూరగాయలో ఉండావంటే అతిశయోక్తి కాదు. ఇది ఆరోగ్యానికి చేసే మేలు వర్ణింప రానిది.

బెండకాయ లో A,B6,C మరియూ E వంటి విటమిన్స్ ఇంకా కాల్షియం, కాపర్ ,జింక్, పోలేట్, మెగ్నీషియం ,నియాసిన్, ఫాస్పరస్ వంటి కనిజలావనాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా మంది తల్లిదండ్రులు వారి వారి పిల్లలకు బెండకాయలను తినిపించడంలో ఉత్సాహం చూపిస్తుంటారు ఎందుకంటే బెండకాయలలో నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే పోషకాలున్నాయి. వీటిని తినడం వల్ల నరాల కణాలు ఉత్తేజితమవుతాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది అర్థం చేసుకున్న శక్తి వస్తుంది తెలివితేటలు మరియు ఆయుర్దాయం పెరుగుతుంది.

బెండకాయలో పీచు పదార్థం అత్యధికంగా ఉంటుంది ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది జీర్ణ శక్తి నీ పెంచుతుంది . సాధారణంగా పైల్స్ ,భగందరా,pistula,అర్శ మొలలు మలబద్ధకం సమస్య ద్వారా పుట్టుకొస్తుంటాయి అయితే వీటినీ తినడం వలన మలబద్ధకం ఉండదు కాబట్టి పై సమస్యలు రావు .దానితో పాటే పెద్ద పేగు శుభ్రంగా ఉండడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ నుండి రక్షించు కోవచ్చు.

బెండకాయలో పాలి ఫినల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి ఇవి శరీరంలో oxidative stress ను తగ్గిస్తాయి ఇంకా శరీరంలో ఉండేటటువంటి హానికారక ఫ్రీ రాడికల్స్ తో పోరాడి బయటకు పంపిస్తాయి.

. బెండకాయలో న్యూక్లియస్ అనే జిగురు పదార్థం ఉంటుంది.అది జీర్ణాశయంలో మరియు పేగులలో పేరుకుపోయిన చెడు mucus ను బయటకు పంపిస్తుంది. కొత్త మ్యూకస్ పెరుగుదలకు సహాయపడుతుంది పేగులలో కదలికలు సక్రమంగా జరిగేలా చేస్తుంది. బెండకాయలను తరచూ తినడం వలన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి అలాగే ఇందులో ఉన్నటువంటి ఖనిజలావనాలు రక్తపోటు నియంత్రణలో ఉండేట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

వీటిలోనీ కెరోటనైడ్స్ కుదుళ్ళు ఒత్తుగా మరియు నల్లగా ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడతాయి. చర్మం నిగనిగా లాడేలా చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

వీటిని తినడం వల్ల టైప్2 డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది.అధిక బరువు సమస్య దూరం అవుతుంది.

ప్రతి రోజు పొద్దున్న భోజనానికి ముందు 5 పచ్చి బెండకాయలను శుభ్రంగా కడిగి క్యారట్ తిన్నట్టుగా నమిలి తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. బెండకాయ నీళ్లు త్రాగడం వల్ల కడుపులో అల్సర్లు తాగ్గుతాయి , జీర్ణ రసాలు బాగా ఉత్పత్తి అవుతాయి , మలినాలు, మురికి బయటకు విషర్పించబడుతాయి( ఓ మూడు పచ్చి బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని ముక్కలుగా కోసి రాత్రి నీళ్ళలో నానబెట్టి ఉదయం ఆ నీళ్లను(బెండకాయ నీళ్లు లేదా సీతా కాషాయం అని అంటారు)త్రాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి.)

బెండకాయ తరచూ తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.వీటిలో ఉండే విటమిన్ c చిగుళ్ల నుంచి రక్తం కారే సమస్యను అరికడుతుంది. బెండకాయలు ఉండే పోషకాలు శ్వాస కోశ సంబంధమైన గొంతు నొప్పి, ఆస్తమా, ముక్కు కారడం ,ముక్కు దిబ్బడ, దగ్గు ,పడిశం వంటి సమస్యలను నివారిస్తుంది. మహిళల్లో పీరియడ్స్ టైం లో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది ఈ బెండకాయ.

Related Posts

1,790 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *