మధుమేహం అంటే ఏమిటి..? అది ఎందుకు వస్తుంది..?అవి ఎన్ని రకాలు..? నివారణ ఎలా ….?

మానవ శరీరం పనిచేయాలంటే అందుకు శక్తి అవసరం. ఆ అవసరమైన శక్తి మనం తినే ఆహారం నుండి లభిస్తుంది.అయితే మనం తిన్న ఆహారం శక్తి గా మారాలంటే మానవ శరీరం లో కొన్ని ప్రక్రియలు జరుగుతాయి.

మనం ఏదైనా ఆహారం తిన్నప్పుడు ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్స్ ( పిండి పదార్థాలు లేదా మాంస కృత్తులు) అనేటువంటివి గ్లూకోజ్ గా విచిన్నమవుతాయి.గ్లూకోజ్ అంటే మన రక్తంలో ఉన్నటువంటి sugars అన్న మాట. అలా గ్లూకోజ్ గా మారినప్పుడే రక్తంలో కలవగలదు . అలా ఈ రక్తం గ్లూకోజ్ నీ శరీరంలోని ప్రతి కణానికి తీసుకువెళ్తుంది. అప్పుడు ఈ గ్లూకోజ్ కణాలలోకి వెళ్ళి సెల్యూలర్ రెస్పిరేషన్ జరిగి మనకు శక్తి లభిస్తుంది.

అయితే ఈ గ్లూకోజ్ అనేది కణాలలోకి దానికదే వెళ్ళలేదు దీని కోసం ఇన్సులిన్ అనే హార్మోన్ కావాలి. సాధారణంగా చెప్పాలంటే ఇన్సులిన్ కీ 🗝️ లాంటిదన్న మాట ఇది ఉంటేనే గ్లూకోజ్ కణాలలోకి ప్రవేశించగలదు .ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ శరీరంలో కాలేయ ఆధీనం లో పని చేస్తున్న క్లోమగ్రంథి ( Pancreas ) ద్వారా ఉత్పత్తి అవుతుంది.

మన రక్తంలో ఉన్న గ్లూకోజ్ ను బట్టి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఒకవేళ ఫ్యాంక్రియాస్ కావలసినంత ఇన్సులిన్ ను విడుదల చేయకపోతే రక్తంలోని గ్లూకోజ్ కణాలకు చేరకుండా బ్లడ్ లోనే ఉండిపోతుంది ఇలా ఎక్కువ మొత్తంలో గ్లూకోజ్ రక్తంలోనే ఉండిపోతే దానిని డయాబెటిస్ లేదా మధుమేహం అని అంటారు.

రక్తంలో ఉన్న గ్లూకోజ్ కు సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడమే డయాబెటీస్ అని అంటారు.

Types Of Diabetis

Type 1 Diabetes :- ఇది ఆటో ఇమ్యూన్ కండీషన్. అంటే మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ క్లోమ గ్రంధిలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాలను పొరపాటున చంపివేయడం వల్ల ఈ టైప్ 1 డయాబెటీస్ వస్తుంది.ఇది ఎక్కువగా చిన్న పిల్లలలో వస్తుంది. ఒకవేళ ఈ టైప్ 1 డయాబెటీస్ వస్తె బయటినుండి ఇన్సులిన్ inject చేసుకోవాల్సి ఉంటుంది.

Type 2 Diabetes :-ఇది ఎక్కువగా పెద్దవాళ్లలో వస్తుంది. మన శరీరంలో ఉన్న గ్లూకోజ్ కు సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి కాకోవడం లేద విడుదల అయినటువంటి ఇన్సులిన్ ను శరీరం లోని కణాలు స్వీకరించకపోవడం వల్ల ఈ టైప్ 2 డయాబెటీస్ వస్తుంది.

Type 2 diabetes కీ కారణం:-కొంతమంది బయట దొరికే పిజ్జాలు, బర్గర్లు ,జంక్ ఫుడ్స్ ,ఫ్యాటీ ఫుడ్స్ ,నూడుల్స్ ,ఫ్రైస్ ఎక్కువగా తినేస్తుంటారు దానివలన గ్లూకోస్ స్థాయిలు పెరిగిపోతుంటాయి. అలా పెరిగిపోయిన గ్లూకోస్ స్థాయిలను బ్యాలెన్స్ చేయడానికి pancreas మరింత ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది. అలా pancreas ఇన్సులిన్ విడుదల చేస్తూ చేస్తూ దాని పై ఒత్తిడి పెరిగిపోవడం తో ఒకానొక టైం లో శరీరానికి కావలసినంత ఇన్సులిన్ ను విడుదల చేయాలేని స్థితికి చేరుకుంటుంది.ఈ స్థితి నే టైప్ 2 డయాబెటీస్ అంటారు.

Type 2 డయాబెటిస్ ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ విడుదలవుతుంది కానీ ఈ ఇన్సులిన్ కి శరీరంలో ఉన్న కణాలు రియాక్ట్ అవ్వవు అందువల్ల గ్లూకోజ్ అనేది కణాల్లోకి వెళ్ళదు దీనిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటారు. అంటే శరీరంలో ఫ్యాట్ లేదా కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగిపోయినప్పుడు ఈ కణాలకు ఉండే లాక్స్ అనేవి ఎక్కడికక్కడ కొవ్వుతో పేరుకుపోవడం వల్ల ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు .

అయితే డయాబెటిస్ ఉన్నవాళ్లలో 90 నుంచి 95 శాతం వరకు ఈ టైప్ 2 డయాబెటిస్ కు చెందిన వారే. దీనికి ముఖ్య కారణం మన జీవన విధానం అంటే మనం తీసుకునే ఆహారం శరీరం యాక్టివ్ గా లేకపోవడం అంటే శరీరానికి సరిపడా పని లేకపోవడం లేదా వంశపారంపర్యంగా రావడం.

Type 3: Gestational Diabetes ఇది గర్భిణీ స్త్రీలకు వస్తుంది కానీ ఇది శాశ్వతంగా ఉండదు కేవలం గర్భంతో ఉన్న సమయం వరకే ఉంటుంది అది కూడా ఐదు నుండి ఏడు శాతం గర్భిణులకు మాత్రమే వస్తుంది.

మంచి డైట్ ఫాలో అవుతూ శరీరంలోని చక్కెర స్థాయిలను నియంత్రించుకుంటే ఏ సమస్య ఉండదు కానీ నెగ్లెక్ట్ చేస్తే తల్లికి మరియు పుట్టబోయే శిశువు ఇద్దరికీ ప్రమాదమే.

Type 4 MODY:-Maturity Onset diabetes of the young ఇది gene mutation వల్ల వస్తుంది .

మధుమేహం లక్షణాలు

  • అతిమూత్రం (పాలీయూరియా),
  • దాహం ఎక్కువగా వేయడం (పాలీడిప్సియా),
  • మందగించిన చూపు,
  • కారణం లేకుండా బరువు తగ్గడం లేద బరువు పెరగడం
  • బద్ధకం
  • నీరసం

పై లక్షణాలు మధుమేహం కాకుండా వేరే వ్యాధి యొక్క లక్షణాలు కూడా అయి ఉండవచ్చు. సందేహాల నివృత్తికై మీ దగ్గరలోని డాక్టర్ వద్ద పరీక్షలు చేయించుకోవడం మంచిది.

మధుమేహం శరీరంపై చూపే ప్రభావం (క్షీణింప చేయడం)

మామూలుగా శరీరంలో ఏదైనా వ్యాధి సోకినప్పుడు అది ఏదైనా ఒక అవయవాన్ని మాత్రమే ప్రభావం చేస్తుంది. కానీ మధుమేహ మాత్రం పూర్తి శరీరాన్ని ప్రభావితం చేసి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కీ దారి తీస్తుంది.అది ఎలా అంటే మనకు శక్తి విడుదల కావాలంటే రక్తంలో ఉన్న గ్లూకోస్ కణాల లోపలికి వెళ్లి సెల్యూలర్ రెస్పిరేషన్ జరగాలి కానీ మధుమేహం వల్ల రక్తంలో ఉన్నటువంటి గ్లూకోస్ కణాల లోపలికి వెళ్లకుండా శరీరంలో ఎక్కడపడితే అక్కడ పేరుకు పోతుంది. రక్తంలో పేరుకుపోయిన గ్లూకోజ్ వల్ల రక్తం చిక్కగా అవుతుంది.మధుమేహం వల్ల శరీరంలోని రక్త నాళాలు,కళ్ళు,హార్ట్,కిడ్నీ మరియు కాళ్ళు ప్రభావితం అవుతాయి.శరీరం లో రెండు రకాల నాలలుంటాయి. చిన్న నాళాలు కళ్ళు మరియు కిడ్నీ లలో పెద్ద నాళాలు హార్ట్ లో ఉంటాయి. రక్తం చిక్కగా ఉండడం వల్ల రక్తనాళాలు చిట్లి పోతాయి దీనివల్ల స్పర్శ కోల్పోవడం అదే మెదడులో అయితే పక్షవాతం రావడం , కనుచూపు మసకబారటం కళ్ళు ఎర్రగావటం జరుగుతుంది. చిక్కగా ఉన్న ఈ రక్తాన్ని కిడ్నీ లు వడ పోసి, వడ పోసి బలహీనంగా మారి చివరికి కిడ్నీ ఫెయిల్యూర్ కి దారితీస్తాయి. గుండె పనితీరులో ఆటంకానికి కారణమై హార్ట్ ఎటాక్ కు దారి తీస్తుంది ఈ చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్న రక్తం.శరీరానికి గాయాలు అయినప్పుడు wound healing కి ఆక్సిజన్ అందకుండా జరగడం వల్ల ఆ గాయాలు మానకుండా లోలోపల కుళ్ళిపోతూ పెరిగిపోతుంది అలా అవయవాలు కోల్పోయే స్థితికి చేరుకుంటుంది. శరీరాన్ని కాపాడే రక్షణ వ్యవస్థ బలహీనపడుతుంది.ఇలా మధుమేహం శరీరంలో ఉన్న ప్రతి కణం పై ప్రభావం చూపి అవయవాలు పనిచేయకుండా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కు దారితీసి చివరకు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

Diabetes patients పాటించవలసిన జాగ్రత్తలు

డయాబెటిస్ అనేది ప్రోగ్రెసివ్ డిసీస్ అంటే ఇది ఒక్కసారి వచ్చిందంటే పూర్తిగా నయం కావడానికి వీలు లేనటువంటిది లేదా రోజు రోజు కి ముదిరేటువంటి వ్యాధి అయినప్పటికీని పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మెడిసిన్ మరియు ఆరోగ్యకరమైన డైట్ తో దీనిని కంట్రోల్లో ఉంచవచ్చు .

  1. నెలకు రెండుసార్లు లేదా నెలకోసారి డాక్టర్ ను కలిసి బ్లడ్ షుగర్ లెవెల్స్ పరీక్ష చేయించుకోవడం(బాధితుని ఆరోగ్య స్థితికి తగ్గట్లు పరీక్షలు చేయించుకోవడం మంచిది)

2) మెడిసిన్ వాడటంలో సమయపాలన పాటించడం చాలా ముఖ్యం.

3) ప్రతిరోజు అరగంట నుంచి గంట వరకు Exercise చేయడం (walking,jaging,runninng,cycling,Aerobic, calisthenic exercise s)

4) ప్రతి రోజూ యోగ చేయడం

5) మంచి నిద్ర అవసరం

6) ఒత్తిడి లేకుండా జీవించడం

7) మానవ శరీరానికి ఒక రోజుకు కావలసిన నీరు త్రాగటం

8)low calorie food తీసుకోవడం.మరియు కొద్దికొద్ది ఆహారంతో రోజుకు ఐదు నుంచి ఆరుసార్లు తినడం మంచిది

9) fruits తినడం

తినవలసిన పండ్లు( ✓ )తినకూడని పండ్లు( X )
AppleBanana 🍌 (అరటి పండు)
Guava(జామ)Jackfruit (పనస)
papaya(బొప్పాయి)Mango 🥭 (మామిడి)
Orange 🍊 (నారింజ)Custard Apple (సీత ఫలం)
……మొదలగునవిGrapes 🍇 (ద్రాక్ష)

10)ఆయిల్ ఫుడ్స్,జంక్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్, ఫ్రైడ్,మసాల ఫుడ్,pasterurized అండ్ stored foods దూరంగా ఉండాలి.

*టైప్ 1 మరియు టైప్ 2 డయాబెటిస్ ఉన్న పెద్దలకు మరియు టైప్ 2 డయాబెటిస్ ఉన్న పిల్లలకు సిఫార్సు చేయబడిన రక్తంలో చక్కెర పరిధి

అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం, ఈ పరిధులు టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్ ఉన్న పెద్దలకు మరియు టైప్ 2 డయాబెటిస్ ఉన్న పిల్లలకు సిఫార్సు చేయబడ్డాయి:

TimeRecommended blood sugar range

Fasting (before eating)
80–130 mg/dL

1–2 hours after a meal
Lower than 180 mg/dL

*టైప్ 1 డయాబెటిస్ ఉన్న 18 ఏళ్లలోపు పిల్లలకు రక్తంలో చక్కెర పరిధి

Time Recommended blood sugar range
Fasting (before eating)
90–130 mg/dL

Bedtime and overnight
90–150 mg/dL

*టైప్ 1 డయాబెటిస్ ఉన్న గర్భిణీలకు సిఫార్సు చేయబడిన రక్తంలో చక్కెర పరిధి

Time Recommended blood sugar range
Fasting (before eating)
Lower than 95 mg/dL

1 hour after a meal
140 mg/dL or less

2 hours after a meal
120 mg/dL or less

Normal Sugar levels of Healthy Adults

8 గంటల ఉపవాసం తర్వాత ఆరోగ్యకరమైన పెద్దలకు (మగ లేదా ఆడ) సాధారణ రక్తంలో చక్కెర పరిధి >70 mg/dL. మరియు <100 mg/dL. ఆరోగ్యకరమైన వ్యక్తిలో 2 గంటల తిన్న తర్వాత సాధారణ చక్కెర స్థాయి 90 నుండి 100 mg/dL మధ్య ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు రోజంతా మారుతూ ఉంటాయి.

Related Posts

217 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *