ఆశ్చర్యపరిచే తుంగ గడ్డి అద్భుతాలు


కలుపు మొక్క గా భావించే తుంగ గడ్డి పంట పొలాలలో,రాగడి నేలలలో, శెలక భూములలో, పొలాల గట్లపై, చెరువులలో ఎక్కడపడితే అక్కడ విరివిగా మొలుస్తుంటాయి.
• గడ్డి మొక్కే కదా అని వీటిని తేలిగ్గా తీసిపరేయకండి. ఎందుకంటే వీటిలో ఎన్నో ఆశ్చర్యపరిచే ఔషధ గుణాలు దాగున్నాయి. పూర్వం ప్రజలు తుంగ గడ్డలను ఆహారంగా తీసుకునేవారు వగరు మరియు చేదు కలగలిపిన రుచి ఉంటుంది . బాగా పెరిగిన తుంగ గడ్డితో ఇంటి పైకప్పులు వేసుకునేవారు , వీటితో మెత్తని చాపలు తయారు చేసేవారు .
తెలుగులో ( తుంగ గడ్డిని లేదా తుంగ గడ్డలను ) తుంగముస్తలు, భద్రము స్తలు , నాగర ముస్తలు అని పిలుస్తుంటారు.
ఇంగ్లీషులో దీనిని నట్ గ్రాస్ (Nut Grass) అని పిలుస్తారు.
ఆయుర్వేదంలో నగర్ మోతు,ముస్తా , ముస్తక,అబ్ద,అంబుధ, అంబోధ, అంభోధర, భద్ర ముస్తా, భద్రముస్తక, ఘణ ,జలదా, జల్దార , మేఘవ, నిరధ , వరిధ ,వరివహా,పయోధ,బలహక, గండ దుర్వ అని వివిధ పేర్లున్నాయి.
తుంగ గడ్డి యొక్క శాస్త్రీయ నామం సైఫరస్ రుతుండాస్ (Cyperus Rotundus)
ఆయుర్వేద చికిత్సలలో తుంగ గడ్డలకు ప్రత్యేక స్థానం ఉంది.
• తుంగ గడ్డిని పీకితే వాటి వేర్లలో తుంగ గడ్డలు ఉంటాయి.వీటిని పగలగొడితే సుగంధ భరితమైన సువాసన వెదజల్లుతుంది ఈ వాసన మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది మెదడుకు మంచి రిలీఫ్ ను కలిగిస్తుంది.
• తుంగ గడ్డలను ముక్కలుగా చేసి కొబ్బరి నూనెలో మరిగించి చల్లారిన తర్వాత ప్రతి రోజూ వెంట్రుకలకు మర్ధన చేస్తే వెంట్రుకలు బాగా పెరుగుతాయి.
• బట్టతలపై వెంట్రుకలను మొలిపించే శక్తి వీటికి ఉంది. తుంగ గడ్డలను పేస్టుగా నూరి నువ్వుల నూనెలో తక్కువ మంటపై మరిగించి చల్లారిన తర్వాత వడకట్టుకొని ప్రతిరోజు మూడు సార్ల చొప్పున బట్టతలపై ఈ నూనెను మర్దన చేసినట్లయితే వెంట్రుకలు మొలుస్తాయి. వెంట్రుకలు బలంగా దృఢంగా ఒత్తుగా పెరుగుతాయి. ఈ నూనె రోజు వాడితే చుండ్రు సమస్యలు దూరం అవుతాయి.
• తలనొప్పి బాధిస్తుంటే తుంగ గడ్డలను నూరి పేస్ట్ చేసి నుదుటికి రాయడం వల్ల తలనొప్పి దూరమవుతుంది.
• తుంగ గడ్డలకు ఒంట్లో వేడిని తగ్గించే గుణం ఉంది.
• ఒక స్పూన్ తుంగ గడ్డల పొడిని రెండు కప్పుల నీటిలో ఒక కప్పు అయ్యేంతవరకు మరిగిస్తే కషాయం తయారవుతుంది. ఈ కాషాయం తాగడం వల్ల గ్యాస్ సమస్యలు దూరం అవుతాయి రక్తం శుద్ధి అవుతుంది, కామెర్ల వ్యాధి నయమవుతుంది.
• కొన్ని తుంగ గడ్డలను పేస్టు చేసి గ్లాస్ పాలలో మరిగించి తాగితే రోగ నిరోధక శక్తి బలపడుతుంది.
• పొట్ట సమస్యలు బాధిస్తుంటే 200 ఎంఎల్ ఆవుపాలలో రెండు తుంగ గడ్డలను నలిపి మరిగించి తాగితే పొట్ట సమస్యలు దూరమవుతాయి.
• పిల్లలకు విరోచనాలు అవుతుంటే పాలు పట్టే ముందు నిపుల్స్ కి తుంగ గడ్డల పేస్టు పూసిన ఆ తర్వాత పిల్లలకు పాలు పట్టించినట్లయితే విరోచనాలు దూరం అవుతాయి.
• జలుబు దగ్గు మరియు డయేరియా కి మూడు గ్రాముల పొడిని గోరువెచ్చటి పాలలో వేసి రోజుకు రెండుసార్లు తాగితే వీటి సమస్యలు తగ్గుతాయి.
• తుంగ గడ్డల పొడిని స్నానం చేసే ఓ గంట ముందు శరీరానికి అప్లై చేసి ఆ తర్వాత స్నానం చేసినట్లయితే శరీరం మంచి సువాసనను వెదజల్లుతుంది. దుర్వాసన దూరం అవుతుంది.
• కీళ్ల వాపులతో బాధపడేవారు తుంగభటుల కాషాయం 60 మిల్లీలీటర్లకు ఒక స్పూన్ అశ్వగంధం చూర్ణం కలిపి రోజుకు మూడుసార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
• తుంగ గడ్డలను నూరి గాయాలపై లేదా పుండ్లపై పూస్తే మానిపోతాయి.
• ఒక స్పూన్ తుంగ గడ్డల పొడి మరియు ఒక స్పూన్ తేనెను కలిపి తీసుకుంటే పేగు సమస్యలు తగ్గుతాయి.
• తుంగ గడ్డలకు క్యాన్సర్ కణాలను చంపే గుణాలు మెండుగా ఉన్నాయి.
• ఇప్పటికీ చైనాలో క్యాన్సర్ నివారణ చికిత్సలలో వీటిని ఉపయోగిస్తున్నారు.

Related Posts

1,707 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *