పోషకాల ఘని గోంగూర

పోషకాల ఘని గోంగూర
ఆకు కూరల్లో అన్నింటికంటే ఎక్కువ ఔషధ పోషకాలు ఉన్న ఆకు కూర గోంగూర.ఔషధ పోషకాలూ మాత్రమె కాదు రుచిలో దీన్ని తలదన్నే ఆకు కూరే లేదు.
గోంగూర రోసెళ్ళ మొక్క(మందార సబ్దరిప్పా) రూపానికి చెందిన కాయగూర ఆకు.వీటిలో ఆకు పచ్చ కాండం మరియు ఎరుపు కాండం అనే రెండు రకాల గోంగురాలున్నాయి.ఈ రెండింటిలో సమానమైన పోషకాలూ ఉన్నప్పటికీ ఎరుపు రంగు కాండం గోంగూర ఎక్కువ పుల్లగ మరియు రుచికరంగా ఉంటుంది.వీటిని రాయలసీమ వంటి ప్రాంతాలలో పుంటికూర అని పిలుస్తారు. ఇంగ్లీష్ లో Sorrel leaves అని పిలుస్తారు.
దీనితో గోంగూర పచ్చడి,గోంగూర పప్పు,గోంగూర పులుసు,గోంగూర పులిహోర, గోంగూర చట్నీ వంటి అనేక రకాల వంటకాలు తయారు చేస్తారు.ఇది కూరగాయ ఆకు ఐనప్పటికీ వీటితో చేసే గోంగూర బిర్యానీ, గోంగూర చికెన్,గోంగూర మటన్,గోంగూర రొయ్యలు అంటూ అనేక రకాల మాంసాహారలతో కూడిన వంటకాలు వాటి రుచి మైమర్చిపోరానిధి. ఇప్పుడైతే రెస్టారెంట్, బార్లల్లో వీటి రిసిపిస్ అనేక రకాలు.
సో ఇప్పటిదాకా గోంగూర యొక్క అనేక ఉపయోగాలు తెలుసుకున్నాం గా మరి ఇప్పుడు వీటి యొక్క ఆరోగ్య ఉపయోగాలు తెలుసుకుందాం.
గోంగూరలో విటమిన్ A,B1,B6,B9, విటమిన్ C , నియాసిన్, రిబోఫ్లావిన్ తో పాటు పొటాసియం, మెగ్నీషియం,ఐరన్,కాల్షియం,సెలీనియం,సోడియం వంటి ఖనిజ లవణాలు ఉన్నాయి.
గోంగూర లో ఉండే విటమిన్ ఎ ద్రుష్టి లోపాన్ని నివారిస్తుంది, రేచీకటి సమస్య ను నయం చేస్తుంది , కంటి చూపును మెరుగు పరచి కంటిని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఎముకలు ధృడంగా ఆరోగ్యంగా ఉండేందుకు గోంగూర లోని cacium బాగా పనిచేస్తుంది.
వీటిలోని విటమిన్ సి శరీరం లో రోగనిరోధక శక్తినీ బలపరుస్తుంది.
గోంగూర లో ఆంటీ ఆక్సిడెంట్స్, ఫ్లవనాయిడ్స్ ఉన్నాయి ఇవి శరరంలో ఏర్పడే టాక్సిన్స్ మరియు ఫ్రీ రాడికల్స్ నీ బయటకి పంపిస్తాయి.వీటికి క్యాన్సర్ను నియంత్రించే శక్తి ఉంది. మహిళల్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారించటానికి గోంగూర ఉండే క్లోరాఫిల్ బాగా పని చేస్తుంది.
రక్తహీనతతో బాధపడేవారికి వీటిలో ఉండే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది.

గోంగూర లో ఉండే పొటాషియం రక్త పోటును నియంత్రించి హార్ట్ ఎటాక్ మరియు పక్ష వాతాం నుండి కాపాడుతుంది.
21రోజులు గోంగూర కాషాయం తాగితే స్రీలలో వచ్చే రుతు క్రమ సమస్యలు దూరం అవుతాయి.
వీటిని తరచూ తినడం వల్ల రక్తం లో చెడు కొలెస్టరాల్ తగ్గి మంచి కొలెస్టరాల్ పెరుగుతుంది.
గోంగూర లో ఫైబర్ ఎక్కవగా ఉంటుంది ఇది జీర్ణ శక్తి నీ మరియు జీర్ణ క్రియను పెంచుతుంది మలం సాఫీగా వచ్చేలా చేసి మలబద్దాకాన్ని నివారిస్తుంది. ఆపై వచ్చే పైల్స్,పిస్తుల,భగందర మరియు పెద్ధ పేగు క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి కాపాడుతుంది.
గోంగూర ను తరచూ తినడం వల్ల వెంట్రుకలు నల్లగా ఒత్తుగా,ఆరోగ్యంగా ఉండేలా తయారవుతాయి.

అస్తమా మరియు కిడ్నీ సమస్యలు ఉన్నవారు.. గొంగురాకు దూరంగ ఉండడం మంచిది.

Related Posts

210 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *