కీర దోస ఆరోగ్య ప్రయోజనాలు

వేసవి వచ్చిందంటే చాలు మనల్ని డిహైడ్రేషన్ నుండి కాపాడడానికి దర్శనమిస్తుంది కీరదోస.దీని శాస్త్రీయ నామం కుకుమిస్ సటైవస్.

దోస లో విటమిన్స్ మినరల్స్ ఫైబర్ ఆంటీ యాక్సిడెంట్ ఫ్లేవ నాయిడ్స్ లిజ్ఞాన్స్ వంటివి ఉంటాయి.

ఉష్ణ తాపాన్ని తగ్గించడం మాత్రమే కాదు ఆరోగ్యాన్నికి మరియు సౌందర్యానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.వీటిని ఎక్కువగా సలాడ్స్ లో ఉపయోగిస్తుంటారు.కీరదోసలో 90% వరకు నీరు ఉంటుంది.వీటిలో క్యాలరీలు తక్కువ కాబట్టి అధిక బరువు సమస్యతో బాధపడేవారు వీటిని రోజువారి ఆహారంలో చేర్చుకున్నట్లైతే బరువు తగ్గవచ్చు.కీరా దోశలో ఉండే ఫైబర్ మలబద్ధకన్ని నివారిస్తుంది.వీటిలో ఉండే ఆల్కలైన్ గుణాలు కడుపులో ఏర్పడిన అల్సర్స్ మరియు ఉదార సంబంధమైన సమస్యలను నివారిస్తుంది.పోట్టలోకి ప్రవేశించిన బద్దె పురుగులను సైతం నశింప చేస్తుంది.కీర
[వీటిని చప్పరించడం వల్ల నోటి దుర్వాసన సమస్య దూరం అవుతుంది
[ కీరదోస శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.
: ఇవి శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్థాయి అందువల్ల మధుమేహస్తులు వీటిని తినడం ప్రయోజకరం.కీర దోస లో ఉండే విటమిన్స్ బ్లడ్ ప్రెషర్ ను తగ్గించి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
కీరదోసలో ఉండే బీట కెరటెన్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
వీటిలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ శరీరాన్ని డిటాక్సిపై చేసి శరీరంలో ఏర్పడిన విష పదార్థాలను బయటకు పంపిస్తాయి.
ఇంకా క్యాన్సర్ కారకాలు అయినటువంటి ఫ్రీ రాడికల్ కణాలతో పోరాడి క్యాన్సర్ ముప్పు నుండి కాపాడుతుంది.
వీటిలో ఉండే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
కీరదోస లోని ఆంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను తగ్గిస్తాయి.

Related Posts

72 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *