కరివేపాకు అద్బుతాలు

కరివేపాకులు మంచి సుగంధభరితమైనవి ఇవి వంటకు మంచి రుచిని అందజేస్తాయి . రుచి మాత్రమే కాదు వీటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి అయినప్పటికీ ఇవి కూరల్లో వచ్చినప్పుడు మనం తీసి పరేస్తాం.కానీ వీటి గురించి తెలిస్తే మనం ఆశ్చర్య పోవాల్సిందే


కరివేపాకు మనం రోజు పొద్దున్న నాలుగు రెమ్మలు తినడం ద్వారా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది, ఎప్పుడైతే మన జీర్ణ క్రియ సక్రమంగా ఉంటుందో అప్పుడు మన నుండి వ్యాధులు దూరంగ ఉంటాయి. జీర్ణ క్రియ సక్రమంగా ఉంటే మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. తద్వార గుండె జబ్బులూ మరియు ఊభకాయం వంటి సమస్యలు నుండి తప్పించుకోవచ్చు. మనం దీనిని ప్రతిరోజు మన వంటలలో తప్పనిసరిగా వేయాలి దీనిలో విటమిన్ ఏ బి సి లు కూడా అధికంగా ఉంటాయి కరివేపాకు తినడం ద్వారా మనకు వెంట్రుకలు కూడా చాలా నల్లగా మరియు ఒత్తుగా అవుతాయి.


దీనిని వంటల్లో మాత్రమే కాకుండా అనేక రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేయటo లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా ఇది మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఇప్పుడు ఉన్న ఈ కాలంలో ఏ వయసు వారైనా కూడా మధుమేహ సమస్య గురించి బాధపడుతున్నారు. ఇలాంటివారు వంటలలో కరివేపాకుని వాడటం చాలా ఉపయోగకరం నాలుగు నుండి ఐదు కరివేపాకులు నేరుగా తినటం మంచిది ఇలా చేస్తే మధుమేహ వ్యాధిని కొద్దిగా తగ్గించవచ్చు. కరివేపాకును తినడం ద్వారా మూత్ర సంభందిత వ్యాధుల నుండి ఉపశమనం పొందొచ్చు. అయితే దీని వేర్లు బాగా కడిగి దానిని నీళ్లలో వేసి మరిగించి దానిని కషాయంగా చేసి రోజు పొద్దున్న తీసుకోవడం ద్వారా మూత్రపిండాల్లో ఉన్న రాళ్లు కరగటంతో పాటు ఇంకా మూత్రపిండా సమస్యలు దూరం అవుతాయి కరివేపాకు మనకు అందుబాటులో లేదనుకుంటే రోజు మనకు దొరకాదు అని అనిపిస్తే అప్పుడు మనం ముందుగా కొన్ని కరివేపాకు ఆకుల్ని పోగు చేసుకుని వాటిని శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టుకుని గ్రైండర్ ద్వారా పొడి చేసుకుని నిల్వచేసుకుని వాడుకోవచ్చు. ఇలా వాడటం కూడా మంచిదే.


జుట్టు పెరుగుదలకు మరియు వెంట్రుకలు తెల్లబడకుండా ఉండేందుకు సహాయపడుతుంది ఇంకా చుండ్రు వంటి సమస్యలను కూడా అరికడుతుంది.


వీటిని ప్రతి రోజు ఆహారం లో చేర్చుకుందo ఆరోగ్యాన్ని పెంపొందించుకుందాం

Related Posts

815 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *