కాలిన ప్రతిదీ నల్లగా అవుతుందేమిటి….?

మండిన ఏ వస్తువైనా నల్లగా మారిపోవడం మనం అనుదినం చూసే విషయాలను ఒకటి అన్ని వస్తువుల విషయంలోనూ ఇది నిజమనిపించవచ్చు మనకు కానీ ఇది అన్ని వస్తువుల విషయంలోనూ నిజం కాదు కాగితం కర్ర బట్ట రెండు గడ్డి వంటి పదార్థాలు మండిపోతే నల్లగా తయారవుతాయి ఈ పదార్థాలు ప్రధానంగా కార్బన్ , హైడ్రోజన్ ,ఆక్సిజన్ తో నిర్మితమై ఉంటాయి ఇవి మండినప్పుడు అందలి కార్బన్ ఆక్సిజన్తో కలిసి కార్బన్ మోనాక్సైడ్ , కార్బన్డై ఆక్సైడ్ ఏర్పడతాయి హైడ్రోజన్ ఆక్సిజన్ తో కలిసి నీటి ఆవిరి ఏర్పడుతుంది ఈ చర్యలు చాలా హెచ్ ఉష్ణోగ్రతల వద్ద సంభవిస్తాయి ఇంతటి ఉష్ణోగ్రతలు మంట సమకూరుస్తుంది ఈ చర్యలో ఏర్పడిన అవన్నీ వాయువులు అందువల్ల అవి గాలిలోకి పోతాయి మిగిలిన నల్లని పదార్థం మండక మిగిలిన కార్బన్ దహనం పూర్తిగా ఆక్సిజన్ అందుబాటులో ఉండునట్లు జరిగితే ఏ విధమైన పదార్థం మిగలదు

ఉదాహరణకు మన ఇళ్ళల్లో ఉపయోగించుకునే వంట గ్యాస్ పూర్తిగా ఆక్సిజన్ తో ఎటువంటి నల్లని మసిలేకుండా మండిపోతుంది ఇందులోని హైడ్రోజన్ కార్బన్లు ఆక్సిజన్ తో కలిసి పూర్తిగా మండిపోతాయి

ఈ వివరణలు పూర్తి నిజాలు కావు ఎందుకంటే వృక్షాలు జంతువుల నుండి ఉత్పత్తి అయిన పదార్థాలలో కొద్ది నిష్పత్తిలో ఇతర ఖనిజాల కూడా ఉంటాయి అంటే వీటిలో సోడియం పొటాషియం కాల్షియం ఐరన్ వంటివి స్వల్ప పరిమాణంలో ఉంటాయి

కర్ర బొగ్గు వంటి వాటిని మండించినప్పుడు బూడిద వర్ణంలో పదార్థం మిగిలిపోతుంది ఈ బూడిదలో దహనం చెందని కార్బన్ తో పాటు మండిన పదార్థంలో ఉన్న లోహపు ఆక్సైడ్లు కూడా ఉంటాయి ఈ లోహపు ఆక్సైడ్లు తెల్లగా ఉంటాయి అందుకే బూడిద వర్ణం వస్తుంది

Related Posts

3,608 Comments

Leave a Reply to Charlesfak Cancel reply

Your email address will not be published. Required fields are marked *