సీతాఫలం ఎంతో బలం ఇది నిజమేన…

సీతాఫలం ఎంతో బలం నిజమే ఈ పండును తింటే మనకు ఎంతో బలం వస్తుంది.సీజన్ వస్తుందంటే చాలు కొన్ని పండ్లు రుచి పదేపదే గుర్తొస్తుంటాయి మార్కెట్లో అవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్లు ఎదురు చూసేలా చేస్తాయి ఇప్పుడు అదే కోవా కి చెందుతాయి సీతాఫలం పండ్లు.ఈ పండ్లలో విటమిన్స్ మినరల్స్ ఫ్యాట్స్ మరెన్నో రకాల పోషకాలు ఉన్నాయి.అమృత ఫలాన్ని తలపించే సీతాఫలాన్ని షుగర్ ఆపిల్ అని కూడా పిలుస్తారు.శీతాకాలం పండుగ పరిగణించే సీతాఫలం మరెన్నో సుగుణాలు ఉన్న ఈ పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఇవి దక్షిణ అమెరికా దేశాలతో పాటు మనదేశంలోనూ విరివిగా పండుతాయి.దీని శాస్త్రీయ నామం “అనోనా రెటిక్యూలట” .

ఈ పండ్లతో స్వీట్లు, జెల్లీలు, ఐస్ క్రీములు, జాములు చేస్తుంటారు.
వీటిలో కెరోటిన్,థయామిన్, riboflavin,నియాసిన్ వంటి ఎన్నో విటమిన్స్ ఉన్నాయి.
సీతాఫలం లో ఉండే ఒక అద్భుతమైన గుణం ఏమిటంటే మానసిక సంబంధమైన టెన్షన్ మరియు డిప్రెషన్ రాకుండా మనకు హ్యాపీ హార్మోన్స్ అయినటువంటి డొపమిన్ మరియు స్వెరటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయని సైంటిఫిక్ గా నిరూపించబడింది.
దీనిని తినడం వల్ల మనసు రోజంతా ప్రశాంతంగా ఉండడానికి వీలు కలుగుతుంది.
వీటిని తినడం వల్ల మెదడు గుండె కంటి ఆరోగ్యాలు మెరుగుపడతాయి.
వీటిలోని మెగ్నీషియం కండరాలను దృఢంగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
Under weight ఉన్నవాళ్లు వీటిని తినడం వల్ల ఆరోగ్యకరమైన బరువు పెరుగవచ్చు.

ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణవ్యవస్థను శుభ్రపరచి దాని పనితీరును మెరుగుపరుస్తుంది మరియు వ్యాధి నిరోధక వ్యవస్థను మెరుగుపడేలా సహాయపడుతుంది.ఈ పండులోని సల్ఫర్ చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది ఇంకా వృద్ధాప్యచాయలను దూరం చేస్తుంది.వీటిని తినడం వల్ల కడుపులో ఏర్పడిన అల్సర్లు మరియు ఎసిడిటీ వంటివి తగ్గుతాయి.వీటిని తినడం వల్ల శరీరంలోని inflammation తగ్గుతుంది.సీతాఫలం గుజ్జు శరీరంలోని క్రీములు మరియు వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తుంది మలబద్ధకంతో బాధపడే వారికి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది.ఇవి క్యాన్సర్ మరియు కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యలను రాకుండా అరికడుతుంది.ఈ పండ్లను తినడం వల్ల ఇమోగ్లోబిన్ స్థాయి పెరిగి రక్తహీనత వంటి సమస్యలు దూరం అవుతాయి.ఇవి దంతాల నొప్పికి మరియు దంతాక్షయ వ్యాధులకు మంచి నివారినీగా పనిచేస్తుంది.ఇంకా వీటిని తినడం వల్ల ఎముకలు దృఢంగా మరియు ఆరోగ్యంగా తయారవుతాయి.

Related Posts

138 Comments

  1. Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *