వృత్త కోణం 360 డిగ్రీ ఎందుకలా…?Why is the angle of a circle 360..?

వృత్తం కోణం 360 డిగ్రీస్ ఎందుకలా

పురాతన కాలంలో మెసపటోమియాలో కాలం కోణం వంటి కొలతలు నిర్ధారణ చేశారు ఇప్పుడు అదే ఇరాక్ ఖగోళ పరిశీలన ఆధారంగా ఈ ప్రమాణాలను నిర్ణయించారు

ఆ రోజుల్లో తెలిసిన విజ్ఞానం ప్రకారం భూమి చుట్టూ సూర్యుడు తిరగడానికి ఒక సంవత్సరం పడుతుందని తెలుసుకున్నారు పైగా సూర్యుడు భూమి చుట్టూ వర్తులాకారంగా తిరుగుతాడని నమ్మారు అంటే ఒక సంవత్సరం పూర్తిగా ఒక వృత్తానికి అనుబంధంగా ఉందని అనుకున్నారు

మిసపటోమియా ప్రజలకు ఒక సంవత్సరం అంటే 360 రోజులు మాత్రమే అని తెలుసు. అందుకే యుత్తాన్ని 360 సమభాగాలుగా చేసి ఒక్కొక్క భాగం ఒక్కొక్క డిగ్రీ అని నామకరణ చేశారు

ఆ కాలంలో మెసపటోమియాలోని విజ్ఞులకు సూక్ష్మ భాగాలుగా విడగొట్టేందుకు మార్గంగా 60 భాగాలు చేసి ఒక్కొక్క భాగం ఒక నిమిషం కోణం అని వర్గీకరించారు అంతటితో దానిని మళ్లీ 60 భాగాలు చేసి ఒక్కొక్క భాగం ఒక సెకను కోనమని తెలియపరిచారు

ఆధునిక భావాల ప్రకారం సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది పైగా సంవత్సరం అంటే 365.24రోజులు.

Related Posts

303 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *