రైతుల రుణమాఫీ ఎవరెవరికి వర్తిస్తుంది

రైతులకు రుణమాఫీ రూ.18,241 కోట్లు నిధులు విడుదల తాజాగా తెలంగాణ ప్రభుత్వం రైతు పంటల రుణమాఫీ కై రూ.18,241 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్త్వులు జారీ .

మొదటి విడతలో భాగంగా 62,758 రైతులకు లక్ష లోపు 37 వేల నుంచి 41 వేల రుణాలని మాఫీ చేసేందుకు రూ.237.85 కోట్లను కేటాయించారు.ఈ విషయమై తెలంగాణా ప్రభుత్వం రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కృషి చేస్తుందని ముఖ్య మంత్రి కేసిఆర్ గారు మరియు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు మీడియా ద్వారా తెలియజేశారు.

అయితే రుణ మాఫీ ఎవరెవరికి వర్తిస్తుంది మరియు ఎవరు వీటికి అర్హులు అన్న సందేహాలపై రైతులలో అయోమయం నెలకొన్నది. ఇట్టి సందేహాలకు క్రింద ఇవ్వబడిన వివరణలు శోధించండి.

1)రుణమాఫీ ఎవరికి వర్తిస్తుంది ?

జ)తేది 11-12-2018 వరకు బ్యాంకు లో అప్పు ఉన్న రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది.

(2). రుణమాఫీ ఎంత వరకు వస్తుంది?

జ) కుటుంబానికి రూ|| లక్ష వరకు మాత్రమే రుణమాఫీ వస్తుంది.

(3), తేది 11-12-2018 నాటికి బ్యాంకులో రూ॥ 1,60,000/- అప్పు ఉంది .వీరికి రుణమాపే వస్తుందా ?

జ) తేది 11-12-2018 నాటికి లక్ష పైబడి అప్పు ఉన్న రూ॥ లక్ష వరకు రుణమాఫీ వస్తుంది.

(4), తేది 11-12-2018 నాటికి రూ॥॥ 70,000/- అప్పు ఉండి, ప్రస్తుతం. అప్పుల రూ! 1,00,000/- ఉన్న వారికి రూ॥ లక్ష రుణ మాఫీ వస్తుందా?

జ. రుణమాఫీ నిబందనల ప్రకారం తేది 11-12-2018 వరకు బ్యాంకు లో అప్పు ఎంత అయితే ఉంటుందో అంతే రుణమాఫీ వస్తుంది. అంటే రూ॥ 70,000/- వరకు మాత్రమే రుణమాఫీ వస్తుంది.

(5) తేది 11-12-2018 వరకు రూ॥ 1,00,000/- అప్పు ఉండి తేది 31-07-2020 నాడు రూ॥ 50,000/- వరకు అప్పును రెన్యువల్ చేసుకున్న వారికి రుణమాఫీ వస్తుందా? ఎంత వరకు వస్తుంది?

) రెన్యువల్ కి రుణమాఫీ కి ఎలాంటి సంబంధం లేదు. తేది 11-12-2018 తరువాత అప్పుని రెన్యువల్ చేసుకున్నా, మరియు అప్పు మొత్తం కట్టి క్లోన్ చేసుకున్న రుణమాఫీ కి అర్హులే. తేది 11-12-2018 వరకు బ్యాంకు లో అప్పు ఎంత ఉంటుందో (MPP. రూ. లక్ష వరకు) రుణమాఫీ కూడా అంతే వస్తుంది. కాబట్టి రూ.లక్ష వరకు రుణమాఫీ వస్తుంది.

(6) తేది 11-12-2018 నాటికి భార్యకు రూ॥ 50,000/- అప్పు ఉండి మరియు భర్తకు రూ॥ 70,000/- అప్పు ఉన్నచో రుణమాఫీ ఎంత వరకు వస్తుంది ?

జ. కుటుంబానికి రూ. లక్ష వరకు రుణమాఫీ వర్తిస్తుంది కాబట్టి భార్యకురూ॥ 50,000/- మరియు భర్తకు రూ॥ 50,000/- రుణమాఫీ వస్తుంది..

(7) తేది 11-12-2018 నాటికి భార్యకు రూ॥ 1,00,000 భర్తకు రూ॥ 1,60,000/- ఉన్న రుణమాఫీ ఎంత వస్తుంది.

చ|| భార్య లేదా భర్త, ఇద్దరిలో ఒక్కరికి మాత్రమే రూ॥ లక్ష వరకు రుణమాఫి వస్తుంది

(8) తేది 11-12-2018 తరువాత తీసుకున్న కొత్త రుణాలకు మాఫీ వస్తుందా?

తేది 11-12-2018 తరువాత తీసుకున్న రుణాలకు రుణమాఫీ వర్తించదు.

Related Posts

776 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *