జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష కొరకు దరఖాస్తుల స్వీకరణ.చివరి తేదీ ఇదే

మంచి పేరున్న విద్యా సంస్థల లో CBSE విధానం లో 6వ తరగతి నుండి ఇంటర్మీడియేట్ వరకు చదవాలని కోరిక ఉన్నా విద్యార్థులకు సువర్ణావకాశం జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష.

ఈ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన ప్రతిభ గల నిరు పేద గ్రామీణ విద్యార్థులకు ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా విద్య , భోజనం ,వసతి కల్పిస్తుంది జవహర్ నవోదయ విద్యా సంస్థలు , చదువుతోపాటు ఆటపాటలకు సమగ్ర వికాసానికి తోడ్పడుతుంది ఈ విద్య సంస్థలు.

ఇందులో అభ్యసిస్తున్న విద్యార్థులను జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ఐఐటీ(IIT) ,నీట్(NIT),JEE-MAINS వంటి అత్యున్నత ప్రవేశ పరీక్షల కొరకు తీర్చి దిద్దుతున్నాయి ఈ జవహర్ నవోదయ విద్యా సంస్థలు.

దేశవ్యాప్తంగా 661 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి ఇందులో ఆంధ్రప్రదేశ్ కి 15 విద్యాలయాలు తెలంగాణకి 9 విద్యాలయాలు ఉన్నాయి.

ఒక్కో విద్యాలయాల్లో ఆరవ తరగతికి గరిష్టంగా 80 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు.2023-24 సంవత్సరంలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు జవహర్ నవోదయ సెలక్షన్ టెస్ట్ (JNVST) కి అర్హత పొందుతారు.

వీటిలో 75 శాతం షీట్లను గ్రామీణ కోటాలో కల్పిస్తారు.ఈ కోటాలో ఆశించే విద్యార్థులు కచ్చితంగా 3,4,మరియు 5వ తరగతి లు పూర్తిగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ పాఠాశాల లో లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతూ ఉండాలి. దానితోపాటు మొత్తం సీట్లలో మూడోవంతు బాలికలకు కేటాయించారు. ఇందులో SC లకు 15%,ST లకు 7.5% OBC లకు 27 శాతం మరియు దివ్యంగులకు కొన్ని శీట్లను కేటాయించారు.

ఆరవ తరగతి నుండి 8 తరగతి వరకు మాతృ /ప్రాంతీయ భాషల్లో బోధిస్తారు.తదనంతరం మాథ్స్ మరియు ,సైన్స్ ఇంగ్లీష్ లో సాంఘిక శాస్త్రం హిందీ లో బోధిస్తారు.

పరీక్ష విధానం: పరీక్ష ఆబ్జెక్టివ్ టైపులో ఉంటుంది మూడు సెక్షన్లతో మొత్తం 100 మార్కులకు 80 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కులు వస్తాయి.రెండు గంటల సమయం. ఎలాంటి నెగటివ్ మార్క్స్ ఉండవు. సెక్షన్ 1 మెంటల్ ఎబిలిటీ 40ప్రశ్నలకు గానూ గంటలో రాయాల్సి ఉంటుంది, సెక్షన్ 2 అర్థమెటిక్ 20 ప్రశ్నలకు గాను 30నిమిషాలలో రాయాల్సి ఉంటుంది, మరియు సెక్షన్ 3 lunguage టెస్ట్ 20 ప్రశ్నలకు గాను 30 నిమిషాలలో రాయల్సి ఉంటుంది.

పరీక్ష ఓఎంఆర్ షీట్లో సమాధానాలు నింపాల్సి ఉంటుంది. బ్లూ లేదా బ్లాక్ పెన్ఉ పయోగించి సరైన ఆప్షన్ సూచించే గడిని పూర్తీ గా దిద్దాలి. ఈ పరీక్షలో అర్హత సాధించడానికి ప్రతి సెక్షన్ లో కనీస అర్హత మార్కులు పొందాల్సి ఉంటుంది.

ముఖ్య విషయాలు:

అర్హత 2023 24 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి.

వయసు: కనీసం పదేళ్లు నిండాలి, 12 ఏళ్లకు మించరాదు.

(మే 1,2012-july 31,2014 మధ్య జన్మించిన వారే అర్హులు.)

Online దరఖాస్తుకు చివరి తేదీ:17-August-2023

Examination Date:20-january-2024

website :https://cbseitms.rcil.gov.in/nvs/

Related Posts

3,938 Comments

  1. I?¦m no longer sure where you’re getting your information, however good topic. I must spend some time finding out much more or working out more. Thanks for wonderful info I was on the lookout for this info for my mission.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *