ఎయిర్ ఫోర్సులో ఉద్యోగ నియామకాలు

రక్షణ రంగంలో లక్షణమైన ఉద్యోగాన్ని ఆశించేవారు ప్రాధాన్యం ఇవ్వాల్సిన వాటిలో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ afcat ముఖ్యమైంది.ఏడాదికి రెండుసార్లు దీన్ని నిర్వహిస్తున్నారు ఇందులో మెరిసిన వారు వాయుసేనలో పైలట్ కావచ్చు.టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లోనూ ఉన్నత హోదాతో సేవలు అందించవచ్చు.పరీక్ష, interview, మెడికల్ టెస్టులతో నియామకాలు ఉంటాయి. శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. ఇలా అవకాశం వచ్చిన వారు లెవెల్-10 హోదాతో రూపాయలు లక్షకు పైగా వేతనం అందుకోవచ్చు.సాధన డిగ్రీ లేదా బీటెక్ అర్హతతో ఏ ఎఫ్ క్యాట్ కు పోటీ పడవచ్చు.ఆఖరు సంవత్సరం విద్యార్థులు మహిళలు అర్హులే. ఇటీవలే కె ఎఫ్ క్యాట్ 2023 ప్రకటన వెలువడిన నేపథ్యంలో ముఖ్య విశేషాలు.

దేశంలో ముఖ్యమైన ఉద్యోగ నియామక పరీక్షల్లో ఎ ఎఫ్ క్యాట్ ఒకటి.ప్రతి ఆరు నెలలకు ప్రకటన వెలువడటం దీని ప్రత్యేకత.అందువల్ల ఈ పరీక్షను లక్ష్యంగా చేసుకున్నవారు విజయవంతమై అవకాశం ఎక్కువ.గరిష్ట వయసు ప్రకారం ఆరేడు సార్లు ఏఎఫ్ క్యాస్ట్ రాసుకోవచ్చు.

టెక్నికల్ బ్రాంచ్ పోస్టులకు అదనంగా ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ రాయాలి ఆన్లైన్ పరీక్షలో అర్హత సాధించిన వారికి స్టేజ్ వన్ స్టేజ్ టు పరీక్షలు నిర్వహిస్తారు. ఫ్లయింగ్ బ్రాంచ్ కు దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూ అనంతరం కంప్యూటర్ రైసుడ్ పైలెట్ సెలక్షన్ సిస్టం పరీక్ష ఉంటుంది. వీటన్నింటిలో అర్హత సాధిస్తే మెడికల్ పరీక్షలు ముఖాముఖి నిర్వహించి శిక్షణకు తీసుకుంటారు. విభాగాన్ని బట్టి ఇది ఏడాది నుంచి 18 నెలలు కొనసాగుతుంది ఈ సమయంలో ప్రతి నెల 56 ,100/- జీతం అందుతుంది దీని పూర్తి చేసుకున్న వారిని శాశ్వత 14 ఏళ్లపాటు కొనసాగే తాత్కాలిక ప్రతిపాదకన విధుల్లోకి తీసుకుంటారు ఉద్యోగంలో కొనసాగిన వారు తక్కువ వ్యావధిలోని దశల వారి అత్యున్నత హోదాలకు చేరుకుంటారు.

పరీక్ష విధానం:
ఆన్లైన్లో 300 మార్కులకు ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు వస్తాయి ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు పరీక్ష వ్యవధి రెండు గంటలు జనరల్ అవేర్నెస్ వెర్బల్ ఎబిలిటీ రీజనింగ్ మెమరీకల్ ఎబిలిటీ మిలిటరీ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
న్యూమరికల్ ఎబిలిటీ ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే అడుగుతారు మిగిలినవి డిగ్రీ స్థాయిలో వస్తాయి వెబ్సైట్లో మాదిరి ప్రశ్నపత్రాల ద్వారా ప్రశ్నల తీరుపై ఒక అంచనాకు రావచ్చు పరీక్షకు ముందు ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్ అందుబాటులోకి వస్తుంది గ్రౌండ్ డ్యూటీలో టెక్నికల్ బ్రాంచ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు ఆదనంగా ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ ఈ కేటీ రాస్తారు వ్యవధి 45 నిమిషాలు 50 ప్రశ్నలు వస్తాయి ప్రతి ప్రశ్నకు మూడు చొప్పున వీటికి 150 మార్కులు కేటాయించారు.

Vacancy jobs: 258
ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ: డిసెంబర్ 30 సాయంత్రం ఐదు వరకు.
ఫీజు:250/-
పరీక్షలు: ఫిబ్రవరి 24,25,26 తేదీల్లో నిర్వహిస్తారు.

పరీక్ష కేంద్రాలు: తెలంగాణలో హైదరాబాద్ వరంగల్ ఆంధ్ర ప్రదేశ్ లో విజయవాడ విశాఖపట్నం గుంటూరు తిరుపతి రాజమహేంద్రవరం
Website:https://afcat.cdac.in/

Related Posts

221 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *