షాక్ మరో మూడు నెలలు తగ్గనంటున్న ధరలు

Price Hike | పాల ధరలు పెరిగాయి. కూరగాయల ధరలు పెరిగాయి. వంట నూనెల ధరలు (Cooking Oil Prices) షాకిస్తున్నాయి. సిలిండర్ భారమవుతోంది. ఈ ధరల పెంపు ఇక్కడితో ఆగకపోవచ్చు. మరో మూడు నెలలు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు.. అంతర్జాతీయ పరిస్థితులు, అంతర్జాతీయ కమోడిటీ ధరల పెరుగుల కారణంగా కంపెనీలకు ఇన్‌పుట్ ఖర్చులు పెరుగుతున్నాయి. దీంతో కంపెనీలు తమ ప్రొడక్ట్స్ ధరల్ని భారీగా (Price Hike) పెంచుతున్నాయి. వంట నూనెలు (Cooking Oil Prices) , పాలు, కూరగాయలు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

ధరల పెరుగుదల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. వచ్చే త్రైమాసికంలో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ధరలు మరింత పెరగడం ఖాయం. దీంతో సామాన్యులకు ఇంటి బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉంది

ఇండోనేషియా ఇటీవల పామాయిల్‌పై ఎగుమతి నిషేధాన్ని ఎత్తివేయడం భారతదేశానికి పెద్ద ఊరటనిచ్చింది. దీంతో భారతదేశంలో వంట నూనెల ధరలు దిగొస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు మలేషియా చికెన్ ఎగుమతుల్ని నిషేధించింది. ఇది సింగపూర్‌, థాయ్‌ల్యాండ్, జపాన్, హాంకాంగ్ లాంటి దేశాలను ప్రభావితం చేస్తుంది.మరో రెండు త్రైమాసికాలు ధరలు పెరగొచ్చని, 2022-23 ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగం తర్వాత ధరలు తగ్గొచ్చని రుమ్కీ మజుందార్ వివరించారు. రాబోయే త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 9 శాతానికి చేరినా ఆశ్చర్యపోవద్దని నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే కనీసం మరో మూడు నెలలు ధరలు పెరగొచ్చని అంచనా

Related Posts

120 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *