శ్రమతో మేధాశక్తి

శ్రమతో మేధాశక్తి
ప్రస్తుత కాల పరిస్థితిలో మనిషి యొక్క ఆయుర్దాయం 70 సంవత్సరాలు. దీనితో పాటు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందులో ఒకటి డిమెన్సియా. ఈ వ్యాధి వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు సమస్య. ఇది వృద్ధాప్యంలోనే కాకుండా యువతలో కూడా అంతకంతకు పెరుగుతున్న సమస్య. దీనికి కారణాలు శారీరక శ్రమ, వ్యాయామాలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, అధికంగా మొబైల్ ఉపయోగించడం , ఇంటర్నెట్ ఆన్లైన్ గేమ్స్ ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు ఉండడం కూడా ఈ డిమెన్సియా వ్యాధికి కారణం కావచ్చు లేదా
కాలానుగుణంగా జరిగే శరీరా క్సీణత కూడా అయిఉండొచ్చు …?

అయితే ఏది ఏమైనేప్పటికినీ వృద్ధాప్యంలో లో వచ్చే ఈ మతిమరుపు సమస్య నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చని యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు ఓ పరిశోధనలో తేల్చి చెప్పారు.
అదేమిటంటే…!
మనిషి 30, 40 ,50 ఏళ్ల వయసులో చేసే శారీరక శ్రమనే (వ్యాయామాలు, నిరంతరంగా ఆడే ఆటలు,సైకిల్ తొక్కడం,ట్రెక్కింగ్,మొదలగునవి) డిమెన్సియా సమస్య నుండి కాపాడుతుందంట…!
శారీరకంగా ఎంత చురుగ్గా ఉంటే మెదడు అంతే చురుగ్గా పనిచేస్తుందట దీని ప్రభావం వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తిపై క్షీనత లేకుండా చేస్తుందట.
దాదాపు 30 సంవత్సరాలు చేసిన పరిశోధనలో ఈ సత్యాన్ని కనుగొనడం జరిగిందని పరిశోధకులు చెప్పారు.
పరిశోధన చేసిన విధానం
1) 1946లో పుట్టిన వారిని ఈ పరిశోధనకు ఎంపిక చేశారు
2) వీరి లో 53% మహిళలు మరియు 47% పురుషులు
3) 30 ఏళ్ల నుంచి 69 ఏళ్లు వచ్చే కాలా వ్యవధిలో వారియొక్క శారీరక శ్రమను పరిశీలించారు
4) నెలకు కనీసం నాలుగు సార్లు సైక్లింగ్ వాకింగ్ వ్యాయామం ఇలా ఏదో ఒక శారీరక శ్రమ చేయడాన్ని ప్రాథమికంగా తీసుకున్నారు
5) 69 ఏళ్ల తర్వాత వారి జ్ఞాపకశ్తి,మెదడు పనితీరును అధ్యయనం చేశారు
6) ప్రత్యేకంగా వ్యాయామం చేసిన వ్యక్తులు మరియు వ్యాయాయం చేయని వ్యక్తుల మెదడు పనితీరును వారియొక్క జ్ఞాకశక్తిని పరిశీలించారు.

Related Posts

61 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *