కలబందతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Aloe vera isolated on white background.

ప్రకృతిలో ఉండే అనేక ఔషధ మొక్కలలో కలబంద ఒకటి. సర్వరోగ నివారిణిగా మన పూర్వీకులు ఎన్నో రకాల వ్యాధుల నివారణకు వాడేవారు. ఇప్పుడు వీటిని ఆయుర్వేద వైద్య విధానాల్లో మరియు సౌందర్య సంబంధమైన తయారీలో వాడుతున్నారు.

కలబందలో విటమిన్ A, C ,E ,B ,B1 ,B2 ,B3 ,B6, B12 తో పాటు ఐరన్, క్యాల్షియం , సోడియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం మరియు కాపర్ లాంటి ఎన్నో పోషకాలు దీని సొంతం.

కలబందను నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
ఇందులో ఉండే పుష్కలమైన ఆంటీ యాక్సిడెంట్స్ వల్ల క్యాన్సర్ కు దారి తీసే ఫ్రీ రాడికల్ కణాలని శరీరంలో వృద్ధి చెందకుండా నివారిస్తుంది.

కలబంద ఉదర సంబంధమైన సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
కడుపులో ఉబ్బసం, అల్సర్స్, అజీర్తి, మలబద్ధకం, వంటి సమస్యలను నయం చేస్తుంది.జీర్ణ శక్తినీ పెంచుతుంది

కలబందలో అన్ని రకాల అమీనో ఆసిడ్లు ఉండడం వల్ల శరీరంలో ఉన్నటువంటి కణజాల అభివృద్ధికి సహాయపడుతుంది.

దీనిలో ఉండే పోషకాల వల్ల జుట్టు రాలే సమస్యను నివారించి జుట్టు ఒత్తుగా పెరిగేలా సహజ సిద్ధమైన మెరుపును ఇస్తుంది.

కలబందలోనీ ఆంటీ ఏజింగ్ లక్షణాల వల్ల చర్మం పై ఏర్పడే మృతకనాలను తొలగించి చర్మం ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా వయస్సు పై బడటంతో వచ్చే ముడతలను తగ్గిస్తుంది.

ఇందులోని ఆంటీ బ్యాక్టీరియల్, ఆంటీ వైరల్ లక్షణాలు చర్మ సంబంధ సమస్యలను నివారిస్తాయి.

కలబంద గుజ్జుని రోజ్ వాటర్ తో కలిపి చర్మానికి అప్లై చేసుకున్నట్లయితే చర్మం లోని మృత కణాలు తొలగి చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

కలబంద శరీరంపై కాలిన గాయాలు త్వరగా మానడానికి ఉపయోగపడుతుంది.

కలబందను తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే అధిక ఉష్ణోగ్రత తగ్గిపోతుంది

కలబంద గుజ్జును నాచురల్ కండిషనర్ గా వాడుకోవచ్చు. కలబంద నూనె వల్ల జుట్టు రాలడం, వెంట్రుకలు తెల్లబడటం, చుండ్రు ఇంకా తలలో వచ్చే అనేక రకాల కురుపులు, దురద వంటి సమస్యలు పోవటమే కాకుండా ఎప్పటికీ రాకుండా నివారిస్తుంది.

వీటితో స్కిన్ లోషన్లు , క్రీమ్ లు, పానకాలు తయారు చేస్తున్నారు.

కలబంద లో ఉండే పై పొరని లేటెక్స్ అని అంటారు ఇది విషపూరితమైనది. కలబంద గుజ్జును వాడేటప్పుడు ఈ విషపూరిత పొరను తీసి శుభ్రంగా కడిగి వాడుకోవాలి.

కలబంద గుజ్జుని తింటున్నట్లయితే రోజుకు 15 గ్రాములు మించకుండా చూసుకోవాలి.

చిన్నపిల్లలకు గర్భిణీ స్త్రీలకు దీన్ని తీసుకునే విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి లేకపోతే లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Related Posts

64 Comments

  1. Heya i’m for the primary time here. I came across this board and I in finding It truly helpful & it helped me out much. I’m hoping to present something again and aid others such as you aided me.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *