పురుషుల వరం అశ్వగంధ

పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అనే సామెత అశ్వగందానికి ప్రసిద్ది.అశ్వగందాన్ని కింగ్ ఆఫ్ ఆయుర్వేదంగా పిలుస్తారు.దీని శాస్త్రీయ నామం వితేనియా సోమ్ని ఫెర.అశ్వగంధంలో ఆల్కలాయిడ్స్, స్టిరైడల్ లాక్టోల్స్ సమృద్ధిగా ఉంటాయి.అశ్వగందాన్ని పెన్నేరు, వరాహ కార్ని, బొమ్మ డోలు గడ్డ చెట్టు అని వివిధ పేర్లతో పిలుస్తుంటారు.

పురుషులలో testosterone booster గా ఇది బాగా పనిచేస్తుంది. ఇది దేహదారుడ్యానికి, కండపుష్టికి మరియు లైంగిక సమస్యలకు మంచి ఔషధం. అలాగే రతిక్రీడ బాగా జరిగేలా, మరియు వీర్యకణాల ఉత్పత్తిలో సహాయపడుతుంది.మగతనం, అంగస్తంభన, సీగ్రస్కలనం వంటి సమస్యలను నయం చేస్తుంది.సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతుంది.

నిద్రలేమితో బాధపడే వారికి అశ్వగంధ చక్కటి పరిష్కారం.
రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు పాలలో చెంచెడు అశ్వగంధ పౌడర్ని కలిపి త్రాగినట్లయితే మంచి నిద్ర పడుతుంది.
బక్కగా బలహీనంగా ఉన్నవారు నిత్యం దీనిని ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన బరువు పెరుగ వచ్చు.ఇంకా నీరసాన్ని, అలసట ని దూరం చేస్తుంది.

దీనిలోని యాంటీ క్యాన్సర్ లక్షణాలు శరీరంలో పేరుకుపోతున్న ఫ్రీ రాడికల్ కణాలతో పోరాడి క్యాన్సర్ వంటి జబ్బుల నుండి కాపాడుతుంది.ఇంకా కీమోథెరపీ వంటి క్యాన్సర్ చికిత్స దుస్ప్రభవాల నుంచి కాపాడుతుంది.

మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
వృద్ధాప్యంలో వచ్చే ఆల్జీమర్స్, పార్కిన్ సన్స్ వంటి జబ్బులను అరికడుతుంది.
శరీరంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
అశ్వగంధ మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. కోపతాపాలు, కోపం ,అరవడం, ఆందోళన మానసిక ప్రశాంతత వంటి సమస్యలను దూరం చేస్తుంది.

రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
హార్ట్ ఎటాక్ వంటి సమస్యల నుండి కాపాడుతుంది.
థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది.
స్త్రీలలో అండకోశమ్లో ఉన్న నీటి బుడగలు వంటి సమస్యలను దూరం చేస్తుంది. సంతానోత్పత్తిని పెంచుతుంది.

అయితే దీనిని వాడే విషయంలో
గర్భిణీ స్త్రీలు, బాలింతలు అశ్వగందానికి దూరంగా ఉండడం మంచిది.

Related Posts

1,554 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *