అరటిపండుతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

banana bunch isolated on white

ప్రపంచంలో కొన్ని పండ్లు కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతాయి కానీ పలు పoడ్లు మాత్రం సులువుగా ప్రపంచంలో అన్ని చోట్ల దొరుకుతాయి అలాంటి పండ్లలో అరటి ఒకటి. సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం అంతా మార్కెట్లో కనిపిస్తూనే ఉంటాయి. వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు.అరటిలో అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు ఉన్నాయి.

వీటిలో అమృతపాణి చక్కెర కేలి అంటూ 50 కి పైగా అరటి రకాలు ఉన్నాయి.
అరటిలో ముఖ్యమైన విటమిన్స్ మినరల్స్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి.
అరటి పండ్లు అధిక శక్తిని కలిగి ఉంటాయి వీటిని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.
క్రీడాకారులు వ్యాయామ పరులు జిమ్ కి వెళ్లే వాళ్ళు తక్షణ శక్తి కై వీటిని తింటుంటారు.
బరువు పెరగాలనుకునే వారికి అరటి పళ్ళు మంచి ఆహారం.

అరటి పండ్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి . మానసిక సమస్యలను దూరం చేస్తాయి.
అరటిపళ్లలో అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి మన శరీరాన్ని దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్ మరియు గుండెకు సంబంధించిన జబ్బుల నుండి కాపాడుతాయి.

అరటి పండులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉండటం చేత గుండె యొక్క ఆరోగ్యాన్ని సహాయపడుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాన్ని నియంత్రిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.అరటి పండులోని పీచు పదార్థం వల్ల జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది ఫలితంగా జీర్ణవ్యవస్థకు సంబంధించిన జబ్బులు దూరం అవుతాయి.అరటిపండు కిడ్నీ యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది వీటిలో ఉండే పొటాషియం కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి.అరటి పళ్ళు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.అరటిలో ఉండే ల్యూకోసైడిన్ జీర్ణాశయం లో మ్యూకస్ ఉత్పత్తిని పెంచి పేగు పూత మరియు అల్సర్స్ వంటివి రాకుండా చేస్తాయి.ఈ పండ్లలో ఉండే విటమిన్ ఏ మరియు విటమిన్ సి చర్మ సౌందర్యాన్ని కాపాడుతాయి ఇంకా జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.

అయితే మధుమేహస్తులు మరియు అధిక బరువుతో బాధపడేవారు ఈ అరటి పండ్లకు దూరంగా ఉండడం మంచిది

Related Posts

142 Comments

  1. Hi, i believe that i noticed you visited my web site so i came to “go back the want”.I am trying to to find issues to improve my website!I suppose its good enough to use some of your ideas!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *