సర్వరోగ నివారిణి గోధుమ గడ్డి విశేషాలు

Young barley and chlorella spirulina. Detox superfood.

గోధుమ గడ్డిని సూపర్ ఫుడ్ గా పిలుస్తారు ఎందుకంటే ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి
విటమిన్ ఏ, సి ,ఈ, కె, బి కాంప్లెక్స్ మినరల్స్ ,ఎంజైమ్స్ ,పైటో కెమికల్స్ ,17 రకాల అమినో ఆసిడ్స్ క్లోరోఫిల్ ప్రోటీన్స్ వంటివి ఎన్నో ఉన్నాయి.

గోధుమ గడ్డి లో ఉండే పోషకాలు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరానికి శక్తిని అందిస్తాయి

ఎన్నో పోషకాలు ఉండడం వల్ల మన శరీరానికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. అందువల్ల
గోధుమ గడ్డిని సర్వరోగ నివారిణిగా చెప్పవచ్చు.
ఇందులో ఉన్న అధిక పీచు పదార్థం వల్ల ఆజీర్ణం, చాతిలో మంట, మలబద్ధకం, గ్యాస్ ఫైల్స్ వంటి మొండి జబ్బులను నయం చేసుకోవచ్చు. దానితో పాటు జీర్ణశక్తి పెరుగుతుంది.
వరుసగా గోధుమ గడ్డి రసం త్రాగడం వలన మెటాబాలిజం పెరుగుతుంది. దాని కారణంగా శరీరం క్యాలరీలను ఖర్చు చేసిన ఫలితంగా అధిక బరువును తగ్గించుకోవచ్చు.
దానితో పాటే మధుమేహం ఐబీపీ తగ్గిపోతాయి..

Wheat grass planted in pot with its extracted juice in glass isolated on white with its reflection.

ఆంటీ యాక్సిడెంట్ ఎక్కువగా ఉన్నా గోధుమ గడ్డి రసాన్ని త్రాగడం వలన ఒత్తిడి ఆందోళన తగ్గిపోతాయి అంతేకాకుండా క్యాన్సర్ వంటి కణాలను నాశనం చేసే శక్తి వీటికి ఉందని ఇటీవలే అధ్యయనాలు తెలిపాయి
ఈ రోజుల్లో గోధుమ గడ్డి రసాన్ని ఇమ్యూనిటీ బూస్టర్ గా వాడుతున్నారు
రోజు ఒక కప్పు గోధుమ గడ్డి రసాన్ని తాగడం వలన జుట్టు రాలడం సమస్యను అధిగమించి జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.

రక్తహీనతతో బాధపడే వారికి
ఈ గోధుమ గడ్డి రసాన్ని తీసుకోవడం వల్ల రక్తంలోని ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది దానితో పాటే రక్తంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది దానివల్ల గుండెపోటు లాంటి సమస్యల నుండి కాపాడుతుంది.

ఇవే కాకుండా గోధుమ గడ్డి రసాన్ని తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఒంటి నొప్పులు మరియు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది

Related Posts

68 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *