బెల్లం తింటే ఎన్ని ఉపయోగలో తెలిస్తే ఇక ఆగరు…

సాధార‌ణంగా బెల్లం మ‌న అంద‌రి ఇళ్లలోనూ ఉంటుంది. దీంతో చాలా మంది స్వీట్లు చేసుకుని తింటారు. ఇక కొంద‌రైతే పండుగ‌ల‌ప్పుడు భిన్న ర‌కాల ఆహారాల‌ను చేసుకుని తింటారు. కానీ నిజానికి బెల్లంను రోజూ తిన‌వ‌చ్చు. బెల్లం వల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం

1. మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధ‌ప‌డేవారు నిత్యం బెల్లం తింటే ప్ర‌యోజ‌నం ఉంటుంది. మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత చిన్న బెల్లం ముక్క‌ను నోట్లో వేసుకుని చ‌ప్ప‌రిస్తూ మింగాలి. ఇలా కొద్ది రోజుల పాటు చేస్తే మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉండ‌దు.2. బెల్లం స‌హ‌జ‌సిద్ధ‌మైన క్లీనింగ్ ప‌దార్థంలా ప‌నిచేస్తుంది. దీన్ని నిత్యం తిన‌డం వ‌ల్ల లివ‌ర్ శుభ్రంగా మారుతుంది. అందులో ఉండే విష‌, వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.. ద‌గ్గు, జ‌లుబు ఉన్న‌వారు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో చిన్న బెల్లం ముక్క వేసి బాగా క‌లిపి ఆ నీటిని తాగితే.. ఆయా స‌మ‌స్య‌ల నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.4. బెల్లం ర‌క్తాన్ని శుద్ధి చేసే ఔష‌ధ ప‌దార్థంగా ప‌నిచేస్తుంది. దీన్ని నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తం శుద్ధి అవుతుంది.

. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్ల‌తోపాటు జింక్‌, సెలీనియం వంటి పోష‌కాలు ఉంటాయి. అందువ‌ల్ల దీన్ని తీసుకుంటే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి.6. శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌టకు పంప‌డంలో బెల్లం అద్భుతంగా ప‌నిచేస్తుంది. దీన్ని తీసుకోవ‌డం వ‌ల్ల శ్వాస‌కోశ వ్య‌వ‌స్థ‌, ఊపిరితిత్తులు, పేగులు, జీర్ణాశ‌యం, ఆహార నాళం అన్నీ శుభ్ర‌మ‌వుతాయి. అందుక‌నే ఫ్యాక్ట‌రీల‌లో దుమ్ము, ధూళి న‌డుమ ప‌నిచేసే కార్మికుల‌కు యాజ‌మాన్యాలు బెల్లం తిన‌మ‌ని ఇస్తుంటాయి. దాన్ని తిన‌డం వ‌ల్ల ఆయా అవ‌య‌వాల‌న్నీ శుభ్రంగా మారుతాయి.7. బెల్లంలో ఉండే పోష‌కాలు మ‌హిళ‌ల‌కు రుతు స‌మ‌యంలో వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. దీని వ‌ల్ల శ‌రీరంలో ఎండార్ఫిన్లు విడుద‌ల‌వుతాయి. ఇవి శ‌రీరాన్ని, మ‌న‌స్సును ప్ర‌శాంతంగా మారుస్తాయి. రుతు స‌మ‌యంలో స్త్రీలు బెల్లంను రోజూ తిన‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉంటుంది

బెల్లంలో మెగ్నిషియం ఎక్కువ‌గా ఉంటుంది. ప్ర‌తి 10 గ్రాముల బెల్లంలో సుమారుగా 16 మిల్లీగ్రాముల మెగ్నిష‌యం ఉంటుంది. ఇది పేగుల‌కు బ‌లం చేకూరుస్తుంది. దీంతో ఆ వ్యవ‌స్థ సుర‌క్షితంగా ఉంటుంది.

10. శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచే గుణం బెల్లానికి ఉంది. అందువ‌ల్ల బెల్లం వేసి త‌యారు చేసిన పాన‌కం వంటి మిశ్ర‌మాన్ని వేస‌విలో తాగాల్సి ఉంటుంది. దీంతో ఎండ వేడి నుంచి శ‌రీరానికి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. శ‌రీరం చ‌ల్ల‌గా ఉంటుంది.

11. హైబీపీ స‌మ‌స్య ఉన్న‌వారు నిత్యం బెల్లం తిన‌డం ద్వారా ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

12. ఆస్త‌మా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు నిత్యం బెల్లం తిన‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉంటుంది. స‌మ‌స్యలు ఇంకా తీవ్ర‌త‌రం కాకుండా ఉంటాయి. ఇత‌ర ల‌క్ష‌ణాలు కూడా త‌గ్గుతాయి.

13. ఆర్థ‌రైటిస్‌, కీళ్ల స‌మ‌స్య‌లు, నొప్పులు, వాపులు ఉన్న‌వారు నిత్యం బెల్లం తిన‌డం వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

14. బెల్లం అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు స‌హాయ ప‌డుతుంది. నిత్యం భోజ‌నం చేశాక దీన్ని మ‌ధ్యాహ్నం, రాత్రి తిన‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. దీంతో క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి. ఫ‌లితంగా అధిక బ‌రువు త‌గ్గుతారు.

15. శ‌రీరానికి త‌క్ష‌ణ‌మే శ‌క్తి కావాల‌ని అనుకునేవారు, బాగా అల‌స‌ట చెందిన వారు బెల్లంను తిని ఒక గ్లాస్ నీటిని తాగితే వెంట‌నే శ‌క్తి ల‌భిస్తుంది. ఎన‌ర్జిటిక్‌గా ఫీల‌వుతారు.

గ‌మ‌నిక‌: బెల్లంను నిత్యం త‌క్కువ మోతాదులో తీసుకోవాలి. మ‌ధ్యాహ్నం, రాత్రి చిన్న ముక్క‌ను తిన‌వ‌చ్చు. లేదా దాన్ని నీళ్ల‌లో క‌లుపుకుని ఆ నీటిని తాగ‌వ‌చ్చు. మోతాదుకు మించితే అనారోగ్య స‌మ‌స్య‌లు వచ్చేందుకు అవ‌కాశం ఉంటుంది

Related Posts

120 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *