Orange తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఆరెంజ్ రుచికి తీపి మరియు పులుపును కలగలిపిన ఈ పండు రూటేసి కుటుంబానికి సంబంధించిన పండ్ల చెట్టు చూడటానికి పెద్ద నిమ్మ పండు ఆకారంలో కనిపించిన రుచి మాత్రం టేస్టీగా ఉంటుంది.
వీటిని బత్తాయి, నారింజ, సంత్ర, ఆరెంజ్ అంటూ వివిధ పేర్లతో పిలుస్తుంటారు.
ఇవి దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియా మధ్యధర ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయి బత్తాయి పండ్ల చెట్లు ఈమధ్య ప్రపంచవ్యాప్తంగా పెంచుతున్నారు. పుట్టింది ఆసియా దేశాల్లోనే అయినప్పటికీ క్రమంగా ఇవి ఇటలీ మధ్యధర ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తున్నారు.
దీని శాస్త్రీయ నామం “సిట్రస్ సైనేన్సిస్”
బత్తాయిలో బోలెడంత ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్ మినరల్స్ విటమిన్ సి తో పాటు థయామిన్ , పోలేట్, పొటాషియం ఇంకా సమృద్ధిగా నీరు వీటి సొంతం.

బత్తాయిలు పోషక విలువలతో పాటు ఔషధపరంగా అనేక లాభాలు ఉన్నాయి. జలుబు, జ్వరం వచ్చినప్పుడు త్వరగా కోలుకోవడానికి ఇవి బాగా పనిచేస్తాయి.
ఆరెంజ్ లో పుష్కలంగా ఉండే ఆస్కార్బిక్ ఆమ్లము ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఆరేంజ్ లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్స్ మరియు ఫ్లేవనా యీడ్స్ మంచి నిద్రను కలిగిస్తాయి. జ్ఞాపకశక్తి సామర్ధ్యాన్ని పెంపొందిస్తాయి.
నారింజను రోజువారి బ్రేక్ ఫాస్ట్ లో ఆడ్ చేసుకున్నట్లయితే ఇన్స్టాంట్ ఎనర్జీ మీ సొంతం.
ఆరెంజ్ లో ఉండే పుష్కరమైన విటమిన్ సి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది అంతేకాదు శ్వాస కోసం సంబంధించిన రోగాలు అయినటువంటి సైనసైటిస్, దగ్గు, పడిశం ,ఆస్తమా వంటి వ్యాధులను అరికడుతుంది.
నారింజలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కారకాలు అయినటువంటి ఫ్రీ రాడికల్స్ ని నిరోధిస్తాయి.
బత్తాయి పండ్లు చర్మ మరియు కేశ సౌందర్యానికి దోహదపడుతాయి.
వీటిలో ఉండే క్యాల్షియం ఎముక పట్టుత్వానికి మరియు కీళ్ల నొప్పులు నడుము నొప్పులు రాకుండా కాపాడుతుంది.
వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. తద్వారా మొలలు, అర్షమొలలు,మొల శంఖ వంటి వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.
బత్తాయి పండు శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రక్తాన్ని గుండెకు మరియు మెదడుకు బాగా సరఫరా చేసి హార్ట్ ఎటాక్ పక్షవాతం వంటివి రాకుండా కాపాడుతుంది. బత్తాయిలో గర్భిణీ స్త్రీలకు కావలసిన పోషకాలు లభిస్తాయి.
వీటిని రోజూ తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. మరియు చిగుళ్ల నొప్పులు గొంతు సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.

Related Posts

143 Comments

  1. Hello, you used to write great, but the last several posts have been kinda boring… I miss your tremendous writings. Past few posts are just a little bit out of track! come on!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *