సర్వ రోగ నివారిణి పసుపు

ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం పసుపు. ఆరోగ్యాన్ని కాపాడుతుంది సౌందర్యాన్ని పెంచుతుంది.పసుపు లేని వంట లేదు పసుపు తెలియని ప్రపంచం లేదు.

వంటే కాదు శుభకార్యాలలోనూ సౌందర్య లేపనాల్లోనూ, మరియు ఆయుర్వేదిక్ చికిత్స లోను దీని వినియోగం వర్ణించలేనిది.

ఋషులువేల సంవత్సరాల క్రితమే పసుపులోని ఔషధాలను గుర్తించి ప్రజలు నిత్యం వినియోగించే విధంగా మార్గదర్శకాలు వేశారు.

పసుపు ఒక క్రిమిసంహారిని. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, ఆంటీ బ్యాక్టీరియల్, ఆంటీ ఫంగల్, యాంటీ వైరల్, ఆంటీ ఇన్ఫ్లమేటరీ, ఆంటీ సెప్టిక్ వంటి మొదలగు గుణాలు చాలానే ఉన్నాయి.

పసుపులో curcumin అనే పదార్థం యాంటీ ఆక్సిడెంట్ల పనిచేస్తుంది. ఇది శరీరంలోని కణజాలం జబ్బుల బారిన పడకుండా రక్షిస్తుంది.దీని ఆంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా నాశనం చేసి క్యాన్సర్ నుండి కాపాడుతుంది.

పసుపు బ్లడ్ ప్యూరిఫైయర్ గా పనిచేస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాలను తగ్గించి గుండెకు రక్త సరఫరా సాఫీగా జరిగేలా చేస్తుంది. గుండె పనతీరును మెరుగుపరుస్తుంది .

పసుపు లోని ఆంటీ సెప్టిక్ గుణాలు శరీర గాయాలు త్వరగా మానేల చేస్తాయి.దద్దుర్లు, దురదలు వంటి చర్మ సమస్యలకు మంచి పరిష్కారం పసుపు.శరీరంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. టైప్ 2 డయాబెటిస్లో పసుపు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.

ఆర్థరైటిస్ ఉన్నవాళ్లు దీన్ని రోజూ తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.శ్వాసకోశ సంబంధమైన జబ్బులనుంచి మరియు వాతావరణం లో మార్పుల వల్ల వచ్చే అలర్జీల నుండి రక్షిస్తుంది.

పసుపు లివర్ మరియు గాల్బ్లాడర్ పనితీరును మెరుగుపరుస్తుంది.

మహిళలకు రుతుక్రమంలో వచ్చే తిమ్మిర్లను పసుపు నియంత్రిస్తుంది.

మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. ఆల్జీమర్స్ బారిన పడకుండా కాపాడుతుంది.

పసుపులోని యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ చర్మ నిగారింపును పెంచుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

మొత్తనికి పసుపు ఒక ఆంటీ బయాటిక్ లా పనీచేస్తుంది.

Related Posts

75 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *