స్కిన్ డిటాక్సింగ్ అంటే తెలుసా…?

ఇప్పుడు స్కిన్ కేర్ రొటీన్ సాధారణమైపోయింది ఒకదాని తర్వాత ఒకటి బోలెడు ఉత్పత్తులు రాస్తున్న ఒక్కోసారి ఏదో ఒక సమస్య అవి దూరం అవ్వాలంటే చర్మానికి డిటాక్సింగ్ కావాలంటున్నారు నిపుణులు
1) దీన్నే స్కిన్ ఫాస్టింగ్ గా కూడా చెప్పొచ్చు పూజ డైటింగ్ పేరుతో అప్పుడప్పుడు ఉపవాసం ఉంటాం కదా! చర్మం విషయంలోనూ అదే చేయాలి. అంటే ముఖం కడిగాక కొద్ది గంటలపాటు దానికి ఏ ఉత్పత్తి రాయకుండా అలా వదిలేయడం అన్న మాట. దీంతో స్కిన్ కి తనను తాను రిపేర్ చేసుకునే అవకాశం కలుగుతుంది.
2) చర్మ సమస్య అనుకోండి ఏం చేస్తాం? స్నేహితుల సలహా అడుగుతాం అవునా సలహా తీసుకున్నారు సరే. కానీ.. ఇద్దరిదీ ఒకే చర్మతీరు కాకపోతే? సమస్య తగ్గకపోగా పెద్దదవచ్చు. ఈ విధానంలో చర్మం ఊపిరి పీల్చుకున్నట్లుగా అవ్వడమే కాదు సహజనులు ఉత్పత్తి చేస్తుంది దీంతో చర్మతీరేదో తెలుస్తుంది. దానికి అనుగుణంగా తీసుకునే చర్యలు లభిస్తాయి.
3) మీరు వాడే ఉత్పత్తులు సరిగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి ఇది ఉత్తమ మార్గం. స్కిన్ ఫాస్టింగ్ తర్వాత చర్మం ఆరోగ్యంగా కనిపిస్తోందంటే ఆ ఉత్పత్తులను కొనసాగించవచ్చు లేదంటే మార్చుకోవచ్చు.
3) బాగా పొడి సున్నిత చర్మం యక్నే వంటి సమస్యలు ఉన్న వారు మాత్రం దీన్ని ప్రయత్నించకపోవడం మంచిది. వాళ్లు క్రీములను తప్పనిసరిగా కొనసాగించాలి. ఈ పద్ధతిని రాత్రిపూట లేదా ఇంట్లో ఉన్న సమయంలోనే పాటించాలి. సన్ స్క్రీన్ వంటివి లేకుండా ఎండలోకి వెళితే చర్మం దెబ్బతింటుంది.

Related Posts

888 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *