మజ్జిగ వలన కలిగే ఉపయోగాలు Butter milk benifits

మజ్జిగ తాగడం మరిచిపోయేవారిలో మీరు కూడా ఉన్నారా? జంక్ ఫుడ్ మీద ఇష్టం తో ఇంటి ఫుడ్ వాల్యూ ని మనం ఒకోసారి మరిచిపోతుంటాం. అలాంటి ఇంటి ఫుడ్స్ లో బెస్ట్ అయిన మజ్జిగ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మజ్జిగని భోజనం తరువాతైనా తీసుకోవచ్చు, లేదా రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు. పెరుగులో నీరు పోసి బ్లెండ్ చేస్తే మజ్జిగ తయారైపోతుంది. దాన్ని అలాగే తాగొచ్చు, లేదంటే కొద్దిగా జీల కర్ర పొడి, మిరియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, పచ్చి మిర్చి కలిపి నూరి మజ్జిగలో వేసి తాగొచ్చు. మజ్జిగ తాగితే ఉండే ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూసేద్దామా.

1. అన్ని మాక్రో న్యూట్రియెంట్స్ ఉంటాయి.

పాలతో పాటు మజ్జిగని కూడా కంప్లీట్ ఫుడ్ అనొచ్చు. బాలెన్స్డ్ డైట్ కి కావాల్సిన పోషకాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇందులో ప్రోటీన్స్, కార్బో హైడ్రేట్స్, విటమిన్స్, ఎస్సెన్షియల్ ఎంజైంస్ అన్నీ ఉన్నాయి. మజ్జిగని ఎప్పుడైనా తాగచ్చు. మజ్జిగలో నీటి శాతం ఎక్కువ కాబట్టి బాడీలో వాటర్ బాలెన్స్ సరిగ్గా ఉంటుంది. ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది స్లో గా అబ్జార్బ్ అవుతుంది. మామూలు నీటికంటే కూడా మజ్జిగ తాగడం ఇంకా మంచిది. కొద్దిగా పులిసిన మజ్జిగ రుచికి కొంచెం పుల్లగా ఉంటుంది కానీ, హ్యూమన్ బాడీకి చాలా మేలు చేస్తుంది.

మజ్జిగ బాడీ ని చల్లబరుస్తుంది. బాగా స్పైసీ గా ఉన్న ఫుడ్ తిన్న తరువాత స్టమక్ లైనింగ్ ని కూల్ చేస్తుంది. అల్లం, జీల కర్ర పొడి కలిపిన మజ్జిగ ఇలాంటప్పుడు తాగితే ఆ స్పైసీ ఫుడ్ వల్ల వచ్చే ఇరిటేషన్ ని తగ్గించవచ్చు. మజ్జిగ మెనో పాజ్ టైం లో ఉన్న మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. హాట్ ఫ్లాషెస్ తో బాధ పడే వాళ్ళు రెగ్యులర్ గా మజ్జిగ తాగితే ఆ సమస్యకి చెక్ పెట్టవచ్చు. హై మెటబాలిక్ రేట్ ఉన్న పురుషులు కూడా బాడీ హీట్ తగ్గించుకోడానికి మజ్జిగ తాగచ్చు.

3. బ్లోటింగ్ లేకుండా చూస్తుంది..బాగా హెవీ గా తిన్న తరువాత కొంచెం బ్లోటెడ్ గా అనిపిస్తుంది కదా. కొంచెం అల్లం, జీల కర్ర పొడి వేసిన మజ్జిగ అరుగుదల కి బాగా సహకరిస్తుంది. స్టఫ్ఫీ గా లేకుండా ఉంటుంది. ఫుడ్ పైప్, మరియూ స్టమక్ లోపలి గోడలకి ఆయిల్ అతుక్కోకుండా చూస్తుంది. అంతే కాక హెవీ మీల్ తరువాత ఉండే లేజీనెస్ ని కూడా బటర్ మిల్క్ పోగొడుతుందిలాక్టోజ్ ఇంటాలరెంట్ వారు హాయిగా మజ్జిగ ద్వారా కాల్షియం ని పొందవచ్చు. ఎందుకంటే పాలలో ఉండే లాక్టోజ్ మజ్జిగ లో లాక్ట్క్ ఆసిడ్ గా రూపాంతరం చెందుతుంది. ఎలాంటి ఎడిషనల్ క్యాలరీస్ లేకుండా మజ్జిగ కాల్షియం ని అందించగలుగుతుంది. దీని వల్ల ఆస్టియో పొరాసిస్ వంటి వ్యాధులు వచ్చే ముప్పు తప్పించుకోవచ్చు.

.
మజ్జిగలో బీకాంప్లెక్స్ విటమిన్స్ పుష్కలం గా ఉన్నాయి. ఇవి ఎనీమియా నుండి కాపాడతాయి. ఇందులో ఉండే విటమిన్ డీ ఇమ్యూన్ సిస్టం ని బలపరుస్తుంది.

మజ్జిగలో బయో యాక్టివ్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ని కలిగి ఉంటాయి. రెగ్యులర్ గా బటర్ మిల్క్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది.

Related Posts

137 Comments

  1. I like what you guys are up also. Such smart work and reporting! Keep up the superb works guys I’ve incorporated you guys to my blogroll. I think it’ll improve the value of my web site 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *