ఆంజీర్ ఆరోగ్య ప్రయోజనాలు

అంజీర్ పండ్లు చాలా పురాతనమైనవి వీటిని మన పూర్వీకులు చాలా కాలం నుండి తింటున్నారు.
అంజీర్ పండ్లకు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది.
వీటినీ తెలుగులో అత్తి పండు, మేడి పండు అనే పేర్లతో పిలుస్తుంటారు
మార్కెట్లో ఇవి తాజా పండ్ల కంటే డ్రైడ్ ఫ్రూట్ రూపంలో ఎక్కువగా లభిస్తాయి.
Anjeer పండ్లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి వీటిలో పుష్కలమైన విటమిన్స్ ,మినరల్స్, ఫైబర్స్ ఆంటీ యాక్సిడెంట్స్ వీటి సొంతం.
ప్రతినిత్యం వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
అంజీర్ పండ్లు వ్యాయామం చేసే వారికి ఎదిగే పిల్లలకు మంచి బలాన్ని ఇస్తాయి.
అంజీర్ లో ఉండే పోషకాలు శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాలను తగ్గిస్తాయి రక్తాన్ని శుద్ధి చేసి రక్తప్రసరణ సక్రమంగా జరగడానికి సహకరిస్తాయి.

అంజీర్ లో ఉండే ఒమేగా3 ఫ్యాటీ ఆసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
అంజీర్లో పుష్కలమైన పీచు పదార్థం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం మరియు ఫైల్స్ వంటి సమస్యలను నిర్మూలిస్తుంది.
వీటిని తినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.
అంజీర్లో పుష్కలంగా ఉండే ఆంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో పేరుకుపోయిన ఫ్రీర్యాడికల్స్ నీ నిర్ములిస్తాయి. ఇంకా వీటిలో బీటా సైటో స్టిరాల్స్ అనే chemicals ఉంటాయి ఇవి క్యాన్సర్ కణాల్లో ఉండేటటువంటి సైటో ప్లాసమ్ అనబడే ద్రావకాన్ని డ్యామేజ్ చేసేసి క్యాన్సర్ కణాలు నాశనం అవ్వడానికి ప్రత్యేకంగా పనిచేస్తాయి.
రక్తహీనతతో బాధపడే వారికి మరియు మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ వంటి విష భరిత రోగాల బారిన పడ్డవారికి ప్లేట్లెట్స్ శాతాన్ని వేగంగా పెంచడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి.
ఆస్తమా, దగ్గు ,జ్వరం ,గొంతు నొప్పి ,కడుపునొప్పి వంటి సమస్యలకు వీటి ద్వారా ఉపశమనం కలుగుతుంది.
అంజి పండ్లలో కాల్షియం అధికంగా ఉంటుంది ఇది ఎముకల దృఢత్వానికి ఎదుగుదలకు విరిగిన ఎముకలు త్వరగా అతకడానికి వేగంగా పనిచేస్తుంది. అలాగే శరీర భాగాలలో వచ్చేటటువంటి మజిల్ క్రాంప్ సమస్యను దూరం చేస్తుంది.
వీటిని తినడం వల్ల పొట్టనిండిన భావన కలుగుతుంది తద్వారా బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఫలితాన్ని ఇస్తాయి.

సంతానలేమి మరియు ,వీర్య కణాల సమస్య తో బాధపడే వారికి ఈ పండు చక్కటి ఫలితాన్ని ఇస్తాయి.

Related Posts

143 Comments

  1. you are really a excellent webmaster. The site loading velocity is amazing. It sort of feels that you’re doing any distinctive trick. Furthermore, The contents are masterpiece. you have done a magnificent job in this topic!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *