అల్లంతో అనేక ప్రయోజనాలు

అల్లం ది దాదాపు 5000 వేల ఏళ్ల నాటి చరిత్ర.
వీటిని అనేక రకాల వంటలలో మరియు ఔషధంగా తయారిలో విరివిగా ఉపయోగిస్తున్నారు.
ఆయుర్వేదంలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది .ఎన్నో జబ్బులకు వీటి ద్వారా ఉపశమనం కలుగుతుంది.
అల్లం నుండి అల్లం నూనె తయారు చేస్తారు.
అల్లం ని ఎండబెట్టి సొంటిని తయారు చేస్తారు వీటిని వంటల్లో మరియు ఆయుర్వేదిక్ చికిత్సలో వాడుతారు.

అల్లం లో ఆరోగ్యాన్ని పెంచే ఎన్నో ఔషధ గుణాలున్నాయి.
అల్లాన్ని తరచుగా తీసుకోవడం వల్ల రోగనియోగ శక్తి పెరుగుతుంది.
అల్లం రక్తాన్ని శుద్ధి చేస్తుంది రక్తంలోని కొలెస్ట్రాలను తగ్గించి రక్త సరఫరా సాఫీగా జరిగేలా చేస్తుంది.
అల్లంతో దగ్గు జలుబు కఫం వంటి సమస్యలు దూరం అవుతాయి.
అల్లం లో ఆంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉన్నాయి ఇవి శరీరంలోని ఫ్రీర్యాడికల్ కణాలతో పోరాడి పెద్దపేగు మరియు అండాశయ క్యాన్సర్ల నుండి కాపాడుతుంది.
అల్లం మలబద్ధకాన్ని పోగొడుతుంది కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అల్లంలో యాంటీ ఫంగల్, ఆంటీ ఇన్ఫ్లమేటరీ, ఆంటీ క్యాన్సర్ గుణాలు మెండుగా ఉన్నాయి.
అల్లంని తరచుగా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు మరియు శరీర వాపుల నుండి ఉపశమనం కలుగుతుంది.
అల్లం నోట్లో చేరిన ప్రమాదకరమైన బ్యాక్టీరియాను సంహరించి చిగుళ్ళు మరియు దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
గొంతు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
అల్లంతో జీవక్రియలు వేగంగా జరుగుతాయి
అల్లం ఆకలిని పెంచుతుంది.
ఇంకా జీర్ణ సంబంధిత సమస్యలైనట్టి అజీర్ణం, కడుపులో పూత వంటి సమస్యలను నయం చేస్తుంది.
అల్లం రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
గర్భిణీ స్త్రీలలో తల తిరగడం, వాంతులు, వికారం వంటి సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది .

Related Posts

63 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *