ద్రాక్ష లో మనకు తెలియని ఎన్నో లాభాలు తెలుసుకోండి

ద్రాక్ష పూష్పించే మొక్కలైన విటేసి కుటుంబంలోని వైటిస్ ప్రజాతికి చెందినది. ద్రాక్షాలో ఇంచుమించు 60 జాతులున్నాయి. ఇవి ఎక్కువగా ఉత్తరార్ధ గోళంలో పెరుగుతాయి.
దీని శాస్త్రీయ నామం విటేశి వినిఫెర.
ద్రాక్ష తోటల పెంపకాన్ని “వైటి కల్చర్” అని అంటారు.
ద్రాక్ష పండ్లు అతి ప్రాచీనమైన కాలం నుండి సాగు చేస్తున్న పండ్లు .వీటి సాగు క్రీస్తు పూర్వం 5000 వేల ఏళ్ల కిందటే ఆసియా ప్రాంతంలో జరిగేది.
ద్రాక్షతో పానీయాలు సలాడ్లు వైన్ వంటివి తయారుచేస్తున్నారు.
ప్రాచీన గ్రీకు రోమన్ నాగరికతలో ఇవి వైన్ తయారీకి పెట్టింది పేరు.
భారతదేశంలోనూ వీటి చరిత్ర గణనీయమైనదే. క్రీస్తుపూర్వం 13 మరియు 12వ శతాబ్దం మధ్య రచించబడిన సుశ్రుత సంహిత మరియు చరక సంహితలలో వీటి ఔషధీయ లక్షణాల గురించి వివరణ ఉంది.

ద్రాక్షాలో విటమిన్స్ మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.
ద్రాక్ష పండ్లను రోజువారి ఆహారంలో తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా చురుకుగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు ఆల్జీమర్స్ వంటి వ్యాధుల ముప్పు ను నివారిస్తుంది.

ద్రాక్ష లో ఉండే లూటినీ, జియగ్జాoతిన్ ,, రేజ్బారెట్రల్, కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి మరియు వృద్ధాప్యంలో వచ్చే కంటి శుక్లాలు మరియు గ్లూకోమాలను తగ్గిస్తాయి.

మైగ్రేన్ తలనొప్పి తో బాధపడే వారికి ద్రాక్ష ఒక చక్కని ఔషధంగా పనిచేస్తుంది.

వీటిలో ఉండే సమ్మేళనాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి.ఇంకా రక్తంలో నీ చక్కెర స్తాయిలను నియంత్రిస్తాయి.
గుండె ఆరోగ్యంగా ఉండేలా బలాన్నిస్తాయి.

ద్రాక్షలో యాంటఆక్సిడెంట్స్ తో పాటు anti-cancer లక్షణాలు చాలా మెండుగా ఉన్నాయి.
University ఆఫ్ కొలరైడ్ క్యాన్సర్ సెంటర్ చేసిన పరిశోధన ప్రకారం నల్ల ద్రాక్ష మెడ మరియు తలలో వచ్చే క్యాన్సర్ల ను నిరోధించడానికి ఉపయోగపడుతుందని తెలుస్తుంది. కేన్సర్ కణాలకు శక్తిని అందించే దారులను మూసివేయడానికి ద్రాక్ష లో కొన్ని రసాయనాలు ఉన్నట్లు తెలుసుకున్నారు.ఇంకా Colorectal and Breast cancer ni నివారిస్తుంది.

ద్రాక్ష పండ్లలోని పోషకాలు కాలేయాన్ని ఉత్తేజపరిచి కాలేయ పనీతీరునీ మెరుగుపరుస్తాయి . ఇంకా కిడ్నీ సమస్యలను కూడా నయం చేయడం లో చక్కగా పనిచేస్తాయి.

ద్రాక్షలోని మినరల్స్ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ద్రాక్షలో ఉండే రిస్వరేటరాల్ అనే కాంపౌండ్ వల్ల వెన్నెముకలో బోన్ డెన్సిటీ పెంచి వెన్ను సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఇంకా దంత సమస్యలను తగ్గిస్తుంది.

ద్రాక్షాలో ఉండే విటమిన్ సి విటమిన్ ఈ మరియు ఫ్లేవర్ నైట్స్ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ద్రాక్షాలోని హైడ్రోలైజ్డ్ కోలాజిన్ స్కిన్ ఎలాస్టిసిటీని తగ్గించి ఏజింగ్ ప్రక్రియను దూరం చేస్తుంది.

అంతేకాక బయటికి వెళ్లినప్పుడు చర్మాన్ని అతినీల లోహిత కిరణాల నుంచి కాపాడుతుంది.

ద్రాక్ష పండ్లను రోజువారి డైట్ లో తీసుకోవడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది. వీటిలోని విటమిన్ ఈ మరియు లినోలిక్ యాసిడ్స్ హెయిర్ గ్రోత్ ని మరియు కుదుళ్లు మందంగా పుట్టేలా చేసి వెంట్రుకలు సహజ సిద్ధమైన తేజస్సును పొందేలా చేస్తాయి.

ఇవి natural sun screen ga కూడా ఉపయోగపడుతున్నాయి.

Related Posts

67 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *