పేదవాడి ఆపిల్ గా పిలువబడే జామ రహస్యాలు

రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం పండ్లలో నెంబర్ వన్ పండు అపరిమిత పోషకాల నిలయం జామ.

సీజన్ తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో దొరికేది జామపండు.
దీనిని పేదవాడి ఆపిల్ గా పిలుస్తుంటారు.
రేటు తక్కువ లాభం ఎక్కువ.
వీటి ఆవిర్భావం మధ్య అమెరికా లో జరిగిందని అధ్యాయానాలు చెబుతున్నాయి.

అనేక ఉష్ణ మండల మరియు ఉప ఉష్ణ మండల ప్రాంతాలలో పండించే ఒక సాధారణ ఉష్ణ మండల పండు జామ.
ప్రపంచంలో నీ అన్ని దేశాలలో ఇవి లభిస్తాయి.
జామ మిర్టిల్ కుటుంబానికి చెందిన సిడియం కోవాకు చెందిన మొక్కలు.
దీని శాస్త్రీయ నామం సిడియం గుజావా
సాధారణ జామ అసాధారణ లాభాలు, వీటిలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్ ఇంకా క్యాల్షియం, ఐరన్ సోడియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉన్నాయి.

అవే కాకుండా కెరోటిన్ లైకోపిన్ , ల్యుటిన్, క్రిప్తోక్స్oటీన్ వంటి ఫ్లేవ నాయిడ్స్ ఉన్నాయి. ఇవి ఆంటీ క్యాన్సర్ , ఆంటీ యాక్సిడెంట్ , ఆంటీ ఇన్ఫ్లమేటరీ, మరియు యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉన్నందున క్యాన్సర్ మరియు ఇతర దీర్ఘకాలిక జబ్బుల బారిన పడకుండా రక్షిస్తుంది.

కమలా పండు కంటే ఐదు రెట్ల విటమిన్ సి ఇందులో ఉంటుంది.వీటిలోని విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.మధుమేహస్తులకు చక్కని ఔషధం జామ. వీటిని రోజువారి ఆహారంలో తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.

వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బులను దూరం చేస్తుంది.

పెరిగే పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఇవి మంచి ఔషధం.

వీటిని తినడం వల్ల జలుబు మరియు కఫం తగ్గిపోతుంది.

వీటిని తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది మలబద్ధకం దూరమవుతుంది . ఇవి మెల్లగా జీర్ణం అవ్వడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఔషధమే.

వీటిని తినడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన కొలాజైన్ ఉత్పత్తి బాగా జరుగుతుంది.ఇంకా ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, కడుపులో మంట మరియు కీళ్ల వాపులు, ఒంటి నొప్పులకి ఉపశమనం కలుగుతుంది.

చిగుళ్ల నుండి రక్త ష్ట్రావాన్ని అరికట్టడంలో జామ ముందుంటుంది. జామతో చేసిన పల్లపొడిని వాడటం వల్ల దంతాలు గట్టి పడతాయి.

జామ ఆకుల్లో అధిక మొత్తంలో ట్యానీన్స్, ఆక్సలైట్స్ ఉంటాయి. లేత ఆకుల్ని నీళ్లలో మరిగించి ఆ నీటితో పుక్కిట పడితే నోటి పూత నోటిలో పుళ్ళు గొంతు నొప్పి వంటివి తగ్గుతాయి.
మొటిమలతో బాధపడే వారికి జామ ఆకులను మెత్తగా రుబ్బి ముఖానికి మాస్క్ లాగా పెట్టుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది అలాగే గజ్జి, తామర వంటి చర్మ సంబంధిత వ్యాధులను అరికడుతుంది.

అంతే కాదు ఆయుర్వేదంలో వీటి ఆకులను ఎన్నో జబ్బులకు మెడిసిన్ గా వాడుతున్నారు.

Related Posts

59 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *