మొక్కజొన్న ఆరోగ్య ప్రయోజనాలు

మొక్కజొన్న కమ్మటి రుచితో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతుంది.
మొక్కజొన్న శక్తివంతమైన మరియు బలవర్ధకమైన ఆహారం.
వీటిని పచ్చిగా, ఉడకబెట్టుకొని లేదా కాల్చుకొని తినవచ్చు.
మొక్కజొన్నతో పాప్ కార్న్ మరియు కార్న్ ఫ్లెక్స్ వంటివి తయారు చేస్తారు.
మొక్కజొన్నను చాలా రకాల ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు.
ఇవి ఎక్కువ మొత్తంలో అమెరికా నుంచి మొదలుకొని చైనా, ఇండియా, ఫ్రాన్స్ ఇండోనేషియా, ఇటలీ వంటి దేశాలలో పండిస్తున్నారు.
వీటి గింజల నుండి నూనెను కూడా తీస్తారు.
దీని శాస్త్రీయ నామం “జియా మేస్”.
మానవునికి ఆరోగ్యపరంగా మొక్కజొన్న ఉపయోగం అనంతం.
మొక్కజొన్నలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ఫైటో కెమికల్స్ ఆంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.
మొక్కజొన్నలోనీ ఫాంటో తైనిక్ అనే ఆమ్లం ఆహారం తేలిగ్గా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. వీటిలోని అధిక పీచు పదార్థం మలబద్ధకం మరియు మొలల సమస్యను తగ్గిస్తుంది.
మొక్కజొన్నలు తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. వీటిని అన్నoకు బదులుగా రవ్వలాగా లేదా రొట్టెగా చేసుకుని తినవచ్చు. వీటి ద్వారా రోగ నిరోధక శక్తి బలపడుతుంది
మొక్కజొన్నలో ఖనిజ లవణాల శాతం ఎక్కువే ఇందులో ఉండే ఫాస్పరస్ మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పును దూరం చేస్తుంది.
మెగ్నీషియం ఎముకలకు బలాన్ని ఇస్తుంది.
మెదడు మరియు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
మొక్కజొన్నలు తాజా అధ్యయనాల ప్రకారం ఆల్జీమర్స్, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలను నివారించడంలో ఉపయోగపడుతుందని తేలింది.
మొక్కజొన్న రక్తహీనతకు అద్భుతమైన ఆహారం ఇందులో ఉండే విటమిన్ B 12, ఐరన్, పోలిక్ యాసిడ్ రక్తంలోని ఎర్ర రక్త కణాల శాతాన్ని పెంచి రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.
కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులను తొలగించి గుండెకు రక్త సరఫరా సాఫీగా జరిగేలా చేస్తుంది.
వీటిని తినడం వలన జీర్ణక్రియ మెరుగవుతుంది మరియు పేగుల బలహీనత తగ్గి strengthen అవుతాయి.
వీటిలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్స్ కేన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి ముఖ్యంగా పెద్ద పేగు క్యాన్సర్ ముప్పు నుండి కాపాడుతుంది.

Related Posts

491 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *