ముల్లంగి ఔషధ పోషకాలూ

ప్రతి సీజన్లో దొరికేటటువంటి ముల్లంగి ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది.
ఇవి ఎక్కువగా చలికాలంలో దొరుకుతాయి.
ముల్లంగి మాత్రమే కాదు వీటి ఆకుల్లోనూ మరియు గింజల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

ముల్లంగి తెలుపు మరియు గులాబీ రంగులలో ఉంటాయి.గులాబీ రంగు ముల్లంగి తో పోలిస్తే తెలుపుముల్లంగిలోనే అత్యధికమైన పోషకాలు లభిస్తాయి.

వీటినీ ఎక్కువగా సలాడ్స్ లో ఉపయోగిస్తుంటారు.

ఇవి రుచికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ వీటిలో ఉండే ఔషధ పోషకాలు చాలా విలువైనవి.


ముల్లంగిలో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. వీటిని రోజువారి ఆహారంలో తీసుకున్నట్లయితే శరీరంలో రోగనిరోధక శక్తి బలపడుతుంది ఇంకా తెల్ల రక్త కణాల ఉత్పత్తిలో సహాయపడుతుంది రక్తంలోని వ్యర్థాలను తొలగించి రక్తానికి కావాల్సిన ఆక్సిజన్ సరాఫరలో కీలక పాత్ర పోషిస్తుంది.
వీటిలో ఉండే బయో కెమికల్స్ మూత్ర సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.

Kidneys లో ఏర్పడ్డ రాళ్ళను సైతం కరిగించే శక్తి కూడా వీటికి ఉంది .ఇవి వైరల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతాయి.ముల్లంగి కాలేయ ఆరోగ్యానికి మరియు కాలేయ సంబంధిత రోగాలు అయినటువంటి jundice, hepatitis లను నయం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది.ముల్లంగిని ప్రతిరోజు తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది మలబద్ధకం అజీర్ణం కడుపునొప్పి వంటి సమస్యలు దూరం అవుతాయి.వీటిలో ఉండే విటమిన్ సి చిగుళ్ల నుండి రక్తం కారే సమస్యను అరికడుతుంది దంత సమస్యలను దూరం చేస్తుంది.ముల్లంగి కూలింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. శరీరాన్ని చల్ల బరుస్తుంది.ఫైల్స్ తో బాధపడే వారికి ముల్లంగి చక్కటి ఫలితాలను ఇస్తుంది. అంతే కాదు వీటికి క్యాన్సర్ తో పోరాడే శక్తి కూడా అధికంగా ఉంది.ముల్లంగి జలుబు దగ్గు మరియు చేని నొప్పి వంటి సమస్యలను నయం చేస్తుంది.స్త్రీలలో వచ్చే ఇర్రెగ్యులర్ menustrual సైకిల్ నీ క్రమబద్ధీకరిస్తుంది.శరీరంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండేందుకు ముల్లంగి అద్భుతంగా పనిచేస్తుంది.

ముల్లంగి రసం నిత్యం సేవిస్తున్నట్లైతే బరువు తగ్గించడంలో మంచి ఫలితాన్నిస్తుంది.

Related Posts

72 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *