స్ట్రాబెరి ఆరోగ్య ప్రయోజనాలు

ప్రకృతిలో లభించే ప్రతి పండు మనకు ఏదో రకంగా ఉపయోగపడుతూనే ఉంటుంది వాటిలో స్ట్రాబెరీ ఒకటి.
ఇది చూడడానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది.
స్ట్రాబెరీ లను ప్రజలు ఎక్కువ ఇష్టంగా తినడం మొదలుపెట్టారు అందువల్ల ఇవి కూడా సూపర్ ఫుడ్ లిస్టులో చేరాయి.
మధ్య ఆసియా ప్రజలు వీటిని “మైండ్ డైట్ ” అని పిలుస్తుంటారు.

వీటిని కూల్ డ్రింక్స్ ,ఐస్ క్రీమ్స్ ,సలాడ్స్ ,బాడీ స్ప్రేస్, బాడీ లోషన్ ఇంకా ఎన్నో సౌందర్య సంబంధమైన తయారీలో వాడుతున్నారు
దీని శాస్త్రీయ నామం “ఫ్రాగారియ అనానస”.
స్టాబెరీస్ లో విటమిన్ సి , flavonoids యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.
వీటిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది చర్మం లోని కొలిజం స్థాయిలను పెంచి చర్మం సౌందర్యవంతంగా మెరిసేలా చేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది కంటిలో ఏర్పడే కంటి శుక్లాలను నివారిస్తుంది.
స్ట్రాబెరీ లో ఉండే పీచు పదార్థం జీర్ణ క్రియను పెంచుతుంది జీర్ణ రసాల ఉత్పత్తి పెరిగేలా చేసి ఆకలిని పుట్టిస్తుంది నివారిస్తుంది.
వీటిలో ఉండే యాంతో సియానిన్స్ గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. రక్తంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండెకు రక్తాన్ని సాఫీగా జరిగేలా చేస్తాయి
రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
వీటిని తినడం వలన దంత సమస్యలు నోటి దుర్వాసన దూరమవుతాయి.
రోజు రెండు పండ్ల చొప్పున వీటిని తినడం వలన మెదడు పనితీరు మెరుగవుతుంది ఆల్జీమర్స్ వంటి సమస్య దూరం అవుతుంది.
వీటిలో ఉండే ఆంటీ యాక్సిడెంట్స్ క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి శరీరంలో ఏర్పడే క్యాన్సర్ కారకాలను దూరం చేసి చర్మం మరియు నోటి క్యాన్సర్ల బారిన పడకుండా చేస్తాయి.
గర్భిణీ స్త్రీలు వీటిని తినడం వలన ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా అందుతుంది గర్భస్థ శిశువుకు ఆరోగ్యకరమైన అవయవాల ఏర్పాటుకు సహాయపడుతుంది.
వీటిని తినడం వలన రక్తంలోని చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి కాబట్టి మధుమేహస్తులు కూడా వీటిని తినవచ్చు.

Related Posts

60 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *