సబ్జా గింజలతో అనేక లాభాలు

హిందువులు పవిత్రంగా భావించే తులసిని పోలిన మొక్క నుంచి వచ్చే సబ్జా గింజలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
సబ్జా గింజల్లో శరీరానికి అవసరమైన పీచు పదార్థం, ఫ్యాటీ ఆసిడ్స్, మరియు ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి.
సబ్జా నీ కస్తూరి తులసి, రుద్ర జడ, తుక్ మారియా మరియు తులసి గింజలు అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్ లో వీటిని బేసిల్ సీడ్స్ అని పిలుస్తుంటారు.

వీటినీ మ్యాజిక్ సీడ్స్ అని కూడా పిలుస్తారు.

వేసవిలో వీటి ప్రాముఖ్యత అదుర్స్.
వీటికి శరీరంలోని వేడిని తగ్గించే గుణాలున్నాయి అందువల్ల
తరచూ డిహైడ్రేషన్కు గురయ్యేవారు సబ్జా గింజల పానీయం తాగితే మంచిది. దాంతో శరీరంలోని ద్రవాలు సమతుల్యంగా ఉంటాయి.

సబ్జా గింజల పానీయం లో అల్లం రసం తేనె కలిపి తాగితే శ్వాస కోస వ్యాధులు దూరమవుతాయి.
అధిక బరువుతో బాధపడే చాలామందికి సబ్జా గింజల పానీయం మంచి చిట్కాల పనిచేస్తుంది.
సబ్జా గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. రోజు పడుకునే ముందు ఒక గ్లాస్ సబ్జా గింజల పానీయం తాగితే మలబద్దక సమస్యలు తొలగిపోతాయి.
అలాగే శరీరంలోని మలినాలు బయటకు వెళ్తాయి.
జీర్ణ సంబంధమైన సమస్యలైన కడుపు మంట ఆజీర్తి, అసిడిటీ, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.
సబ్జా గింజలు శరీరంలోని షుగర్ లెవెల్స్ నియంత్రించడంలో అద్భుతమైన పనితీరును కనబరిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
సబ్జా గింజలు చర్మం మరియు జుట్టు ఆరోగ్య సమస్యల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. సబ్జా గింజలు పొడవాటి దృఢమైన జుట్టుకు అవసరమైన ఐరన్, విటమిన్ కె మరియు ప్రోటీన్స్ తో నిండి ఉన్నందున ఆర్యకరమైన జుట్టు నిర్వహించడంలో ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే వీటిలో ఉండే ఆంటీ యాక్సిడెంట్స్ చర్మన్ని జుట్టు నీ ఆరోగ్యంగా ఉంచే లా చేస్తాయి మరియు శరీర కండరాలు ఎముకలను దృఢపరచడానికి మరియు దెబ్బతిన్న చర్మాన్ని పునరుద్ధరించడానికి సహాయపడతాయి.
సబ్జా గింజల్లోని యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలు కండరాల సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది మరియు కోరింత దగ్గును నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. సబ్జా
శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని క్యాన్సర్ కణాలతో పోరాడుతాయి.

Related Posts

58 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *