ప్రకృతి వరం ఉసిరి తో అనేక ఆరోగ్య సమస్యలు పరార్

అనేక ఆరోగ్య సమస్యలకు ప్రకృతి ప్రసాదించిన వరమే ఉసిరి అందుకే వీటిని ఆయుర్వేదంలో వరంగా భావిస్తారు.
తల వెంట్రుకలు మొదలు కొని కాళీ గోల వరకు ఉసిరి మానవ శరీరానికి సహాయపడే సర్వరోగ నివారిణి.
ఉసిరిని ద ఇండియన్ గూస్ బెర్రీ,శ్రీ ఫలం,Amla అని పిలుస్తారు.
ఉసిరికాయలతో పాటు, గింజలను, ఆకులను, పూలను వేళ్లను, మరియు బెరడును ఆయుర్వేద చికిత్సలో ఉపయోగిస్తుంటారు.
త్రిఫలాలలో ఇది మొదటిది.
ఇవి వాత పిత్త కప దోషాలను సమతుల్యంగా ఉండేలా చేస్తుంది.
ఉసిరిలో అనేక సూక్ష్మ పోషకాలతో పాటు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీనిలో ఒక రోజుకు సరిపడ విటమిన్ సి దొరుకుతుంది.
ఇది శరీరంలో రోగనిరోధకవ్యవస్థ బలపడేలా చేస్తుంది.
ఆయుర్వేదం ప్రకారం వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉంది.
ఉసిరి జుట్టు ఆరోగ్యంలో మరియు వాటి సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది.జుట్టు రాలడం మరియు చుండ్రు వంటి ఇతర సమస్యలకు వీటితో హోమ్ రెమెడీస్ అనేకం ఉన్నాయి.
ఉసిరి కంటి చూపును మెరుగుపరచడంలో ముందుంటాయి. కళ్ళు ఆరోగ్యంగా ఉండేలా సహాయపడతాయి.
చర్మంలో ఉండే మృత కణాలను తొలగించి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. కోలాజిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.స్కిన్ ఎలాస్టిసిటీ నీ,dryskin ను నివారిస్తుంది.
మధుమేహం అదుపులో ఉంటుంది.
వీటిని రోజుకు ఒకటి తినడం వల్ల మేధస్సు శారీరక బలం
పెరుగుతుంది.
ఉసిరి కఫం మరియు జలుబు దగ్గు అనేక రకాల వైరస్ మరియు బ్యాక్టీరియా వ్యాధులను నివారిస్తుంది.
ఉసిరిలో ఉండే ఆంటీ క్యాన్సర్ లక్షణాలు శరీరంలో ఏర్పడ్డ ఫ్రీ రాడికల్ కణాలతో పోరాడి క్యాన్సర్ నుండి రక్షిస్తాయి.

Related Posts