బూడిద గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు

బూడిద గుమ్మడికాయ అనగానే దిష్టి తీయడానికో, గుమ్మం ముందు వేలాడదీయడానికో , గృహప్రవేశాలలో, వస్తువుల కొనుగోలులో, మరియు శుభకార్యాల్లో గుర్తొస్తుంటాయి .
కానీ వీటిలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ఔషధ గుణాలున్నాయి.
బూడిద గుమ్మడి కాయల్ని బృహత్ఫలం , కూష్మాండమం అని వివిధ పేర్లతో పిలుస్తుంటారు.
వీటితో వడియాలు హల్వాలు వంటి ఆహార పదార్థాలు తయారు చేస్తారు.
బూడిద గుమ్మడి కాయల్ని రోజువారి ఆహారంలో తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
100 గ్రాముల గుమ్మడికాయలో 96% నీరు మిగతాదంతా వివిధ పోషకాలు ఉంటాయి. క్యాలరీస్ తక్కువ పోషకాలు ఎక్కువ. అందువల్ల బూడిద గుమ్మడికాయలు weight loss లో అధిక బరువుతో బాధపడే వారికి మంచి ఫలితాల్ని ఇస్తాయి.
ప్రతిరోజు పొద్దున ఒక గ్లాస్ బూడిద గుమ్మడికాయ రసం త్రాగడం వల్ల అనేక లాభాలు పొందవచ్చు.
బూడిద గుమ్మడి రసం ఒంట్లో వేడిని తగ్గిస్తుంది అధిక వేడి శరీరం గల వారికి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది.
కడుపులో మంట, అల్సర్, అజీర్తి, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలన్నీ దూరమవుతాయి.
వీటిని ఏదో ఒక రూపంలా ఆహారంలో తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్యలు తలెత్తవు.
బ్లీడింగ్ ఫైల్స్ తో బాధపడే వారికి చక్కటి పరిష్కారం ఈ గుమ్మడి కాయలు.
వీటి విత్తనాలతో తీసిన నూనె ఎన్నో చర్మ సంబంధమైన రోగాలను అరికడుతుంది.
కడుపులో ఉండే టేప్ వామ్స్ ని నశింప చేస్తుంది.
నిత్యం వీటిని సేవించడం వల్ల మధుమేహం హైపర్ టెన్షన్ మరియు హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు.
వీటిలో ఉండే ఆంటీ యాక్సిడెంట్స్ శరీరంలోని మలినాలను బయటకు పంపిస్తాయి. శరీరంలోని క్యాన్సర్ కణాల శాతాన్ని తగ్గిస్తాయి.
బూడిద గుమ్మడికాయ శారీరకంగానే కాదు మానసికంగాను ఎంతో మేలు చేస్తుంది.
Stress, Anxiety, overthinking,diffression వంటి మానసిక సమస్యలను దూరం చేస్తుంది.
మెదడును ఉత్తేజ పరుస్తుంది. మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉండేట్లు సహాయపడుతుంది.
మేధస్సును పెంచుతుంది.
చిన్నపిల్లలు వీటిని సేవించడం వల్ల జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు.
ఇంకా ఎముకలు స్ట్రాంగ్ గా దృఢంగా తయారవుతాయి.
గుమ్మడికాయల్లో ఉండే ఆంటీ ఏజింగ్ లక్షణాలు ఏజింగ్ ప్రక్రియను నియంత్రించి వృద్ధాప్య చాయలని దూరం చేస్తాయి.

శరీరంలో హార్మోనల్ imbalance నీ సరిచేస్తుంది

Related Posts

129 Comments

Leave a Reply to Qizlhq Cancel reply

Your email address will not be published. Required fields are marked *