Apple పండు తినడం వల్ల ఎన్నో అనేక ప్రయోజనాలు.

చూడగానే కొరుక్కు తినాలనిపించే పండు Apple. దీనిని తినడం వల్ల ఎన్నో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
ఆపిల్ పండు రోజేసి కుటుంబానికి చెందినది దీని శాస్త్రీయ నామం”మాలస్ డో మాస్టిక”.
ప్రపంచంలో దాదాపు 8 వేల రకాల Apple పండ్లు ఉన్నాయి.

Apples సంవత్సరం అంతా అందుబాటులో ఉండేటటువంటి పండ్లు.
ప్రపంచంలో అత్యధికంగా వీటిని చైనా దేశం ఉత్పత్తి చేస్తుంది. మన భారత దేశంలో హిమాలయ పర్వత శ్రేణులు అయినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు హిమాచల్ ప్రదేశ్ వంటి చల్లటి ప్రదేశాలలో పండించబడుతున్నాయి అంతేకాకుండా ఇప్పుడు తెలంగాణలోని ఆదిలాబాద్ లో మరియు ఆంధ్రప్రదేశ్ లోని అరకు వంటి ప్రదేశాలలో వీటిని పండించడం మొదలు పెట్టారు.

ఆపిల్ పెంపకాన్ని పోమోలజీ అని అంటారు.

ఆపిల్ లో విటమిన్ A,B,C,E,K తో పాటు తయామిన్ సోడియం పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ అలానే పైటో ఫ్లేవనాయిడ్స్ మరియు ఆంటీ ఆక్సిడెంట్ వంటి సూక్ష్మ పోషకాలు ఉన్నాయి.
ఆపిల్ లో ఉండే సూక్ష్మ పోషకాలు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
వీటిని తరచుగా తినడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. మతిమరుపుకి కారణమయ్యే ఆల్జీమర్స్ వ్యాధిని నివారిస్తూ మెదడుకి రక్షణ ఇస్తుంది. అంతేకాదు నరాలపై ప్రభావం చూపే ఫర్కిన్ సన్స్ వ్యాధినీ కూడా తగ్గిస్తుంది.
వీటిలోనే విటమిన్స్ కాటరాక్ట్స్, గ్లాకోమ మరియు రేచీకటి వంటి కంటి సమస్యలను దూరం చేస్తాయి.

వీటిని తినడం వల్ల శరీరంలోని డిఎన్ఏ ను oxidative stress నుండి కాపాడి ప్యాంక్రియాస్,మరియు పెద్ద పేగు క్యాన్సర్ ముప్పును దూరం చేస్తుంది.

Apples లోని పెక్టిన్ జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.

వీటిని తినడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
వీటిని తినడం వలన కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతున్న కారణంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కటి ఔషధం.

వృద్ధాప్య ఛాయలను నియంత్రిస్తుంది,చర్మాన్ని కాపాడుతుంది.

Related Posts

1,978 Comments

Leave a Reply to Davidbip Cancel reply

Your email address will not be published. Required fields are marked *