చెర్రీస్ తో లాభాలెన్నో

చెర్రీస్ చూడటానికి ఎర్రగా నిగనిగాలాడుతూ కనిపిస్తాయి. వీటి రుచి ఒక అద్భుతమే వీటిని ఇష్టపడని వారంటూ ఉండరు.ఇవి ఆకర్షణీయమైన రంగు రుచితో పాటు అనేక పోషకాలు వీటి సొంతం.వీటిని రోజు తినడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.వీటిలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్, flavonoids, కెరోట నైయిడ్స్, ఆంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.

చెర్రీ పండ్లలో “ఆంతో సయానిన్” అనే ఎర్రటి పదార్ధం ఉంటుంది. దీని ఆంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఒళ్ళు నొప్పులకు ,కండరాల నొప్పులకు, కీళ్ల నొప్పులకు ఉపశమనం ఇస్తుంది. ఇంకా పొట్ట దగ్గర పేరుకుపోయిన అధిక కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
చెర్రీస్ లో ఫైబర్ ,తయామిన్, రైబో ఫ్లెవెన్, విటమిన్ b6 వంటి పోషకాలు మెటబాలిజం ప్రక్రియను గాడిలో పెడతాయి తద్వారా అధిక బరువు తగ్గవచ్చు.

వీటిలో కార్బోహైడ్రేట్స్ శాతం చాలా తక్కువ కాబట్టి మధుమేహస్తులు తగిన మోతాదులో వీటిని తినవచ్చు .
కీళ్లలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా పేరుకుపోవడం వల్ల వచ్చే గౌట్ సమస్యల నుండి ఈ పండ్లు బయటపడేస్తాయి. కీళ్లలో ఏర్పడే యూరిక్ యాసిడ్ను బయటకు పంపిస్తాయి.
వీటిలో మంచి ఫైబర్ ఉంటుంది వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల గ్యాస్, అసిడిటీ వంటి జీర్ణ సమస్యలు దూరమవుతాయి. తిన్న ఆహారం తేలిగ్గా జీర్ణం అవుతుంది.
చెర్రీస్ లో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
వీటిలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల గుండె సంబంధిత రోగాలు దూరం అవుతాయి రక్తపోటు అదుపులో ఉంటుంది.
చెర్రీస్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్, కెరోట నాయిడ్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని పెంచుతాయి ఆల్జీమర్స్ మరియు పర్కిన్ సన్స్ వ్యాధులనుండి కాపాడుతాయి.
రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి రక్త సరఫరాను సాఫీగా జరిగేలా చేస్తుంది.
చెర్రీస్ లో ఉండే అద్భుతమైన ఆంటీ యాక్సిడెంట్స్ పలు రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది.
వీటిలో ఉండే మెలటోనిన్ నిద్రలేమి సమస్యను దూరం చేసి మంచి నిద్రను ఇస్తుంది.

Related Posts

638 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *