సూపర్ టేస్టీ ఫ్రూట్ సపోటా రహస్యాలు

తీయనైన సూపర్ టేస్ట్ తో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలగలిపిన పండు సపోటా. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు వీటిని ఇష్టపడని వారు ఉండరు.సపోటా ఒక సతత హరితమైన చెట్టు ఇది ఉష్ణ మండల ప్రాంతాలలో పెరుగుతుంది భారత ఉపఖండం మరియు మెక్సికో ప్రాంతాలలో ఎక్కువగా తోటలను పండ్ల కోసం పెంచుతారు. స్పానిష్ పాలకులు ఫిలిప్పీన్స్ లో ఈ పంటను ప్రవేశపెట్టారు.సపోటా శాస్త్రీయ నామం “మనీల్ కర జపోట”.సపోటాలో విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ న్యూట్రియంట్స్ పీచు పదార్థం పుష్కలంగా ఉన్నాయి.ఇవి తీయదనంతో పాటు ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి అందువల్ల బలహీనంగా ఉన్నవారికి ఇవి తక్షణ శక్తినిస్తాయి క్రీడాకారులు తక్షణ శక్తిని పొందేందుకు వీటిని తినడానికి ఇష్టపడతారు.వీటిని తినడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆరోగ్యకరమైన బరువు పెరగొచ్చు.సపోటాలో యాంటీ వైరల్, ఆంటీ బ్యాక్టీరియల్ మరియు ఆంటీ పారాసిటిక్ సుగుణాలు సమృద్ధిగా ఉన్నాయి.వీటిని తినడం వల్ల పెద్దపేగు మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ల ముప్పు నుండి బయటపడవచ్చు.

సపోటాలో ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా ఉండేలా చేసే ఐరన్, పోలేట్, క్యాల్షియం, పొటాషియం, జింక్, కాపర్, ఫాస్పర స్, సెలీనియం సమృద్ధిగా ఉన్నాయి.వీటిని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది రక్తహీనత తగ్గుతుంది.వీటిలో కంటి మరియు చర్మ ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ ఏ విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉన్నాయి. వీటిని రోజువారి ఆహారంలో చేర్చడం వల్ల ముడతలు మరియు వృద్ధప్రచాయాలు తగ్గించి మెరిసేటటువంటి చర్మ నిగారింపును పెంచుతుంది.సపోటా పళ్ళు త్వరగా జీర్ణం అవుతాయి ఇందులో ఉండే పీచు పదార్థం శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇంకా మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి.బాలింతలు వీటిని తినడం వల్ల పిల్లలకు పాలు పుష్కలంగా వృద్ధి చెందుతాయి.సపోటా పండ్లు తేనెతో కలిపి తీసుకున్నట్లయితే సీగ్రస్కలనం తగ్గి రతి సామర్థ్యం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.సపోటా విత్తనాలతో తయారుచేసిన నూనెతో కేశాల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు జుట్టు రాలిపోవడం సమస్యను తగ్గిoచి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది ఇంకా చుండ్రువంటి సమస్యలు తగ్గుతాయి.

Related Posts

58 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *